నేను భయం లేకుండానే జీవిస్తాను !

త్రిష… పదహారేళ్ళుగా కథానాయికగా కొనసాగుతోన్న ముద్దుగుమ్మ.మూడున్నర పదుల వయసులోనూ ముగ్ధమనోహర రూపంతో ఆకట్టుకుంటోన్న ఆ చెన్నై సోయగం.. అడ్వెంచరస్ క్రీడల్లో మునిగితేలుతోంది. సినిమాల పరంగా కాస్త వెనుకబడ్డ ఆ సీనియర్ బ్యూటీ.. ఇప్పుడు సరికొత్త అడ్వెంచర్స్‌తో టైమ్ పాస్ చేస్తోంది.ఈరోజుల్లో హీరోయిన్‌గా ఐదేళ్ల కాలాన్ని నెట్టుకురావడమే చాలా కష్టం. అలాంటిది.. పదహారేళ్లపాటు కథానాయికగా కొనసాగుతోన్న ముద్దుగుమ్మ త్రిష. ఇండస్ట్రీకొచ్చి ఇన్నేళ్లయినా కూడా ఈ అమ్మడు తన అందాన్ని అలాగే కాపాడుకుంటూ వస్తోంది. అయితే అవకాశాల విషయంలో ఈ బ్యూటీ ఇప్పుడు కాస్త వెనకబడింది. చిన్నా చితకా సినిమాలు తప్ప త్రిష చేతిలో చెప్పుకోదగ్గ సినిమా అంటూ ఏదీలేదు. దీంతో అమ్మడు అమెరికా, కెనడా దేశాల్లో స్పెషల్ వెకేషన్ ప్లాన్ చేసుకుంది.
అమ్మాయిగారు ఫర్టిక్యులర్‌గా అమెరికా, కెనడా వెళ్లడానికి ఓ ప్రత్యేక కారణం కూడా ఉంది. ఇప్పటి వరకూ తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కథానాయికగా పేరు తెచ్చుకున్న త్రిష.. ఈ ఏడాది ‘హే జ్యూడ్’ చిత్రంతో మల్లూఉడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చింది. మలయాళ యంగ్ హీరో నివీన్ పాల్ సరసన ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది ఈ సీనియర్ బ్యూటీ. ఈ చిత్రంలో క్రిస్టల్ పాత్రలో మెరిసిన త్రిషకు.. మంచి గుర్తింపే కాదు.. లేటెస్ట్‌గా నార్త్ అమెరికా ఫిల్మ్ అవార్డ్స్‌లో పురస్కారం కూడా లభించింది.
ఈ అవార్డు కోసం అమెరికా బయలుదేరి.. అక్కడ నుంచి కెనడా చేరింది త్రిష. కెనడాలోని ప్రముఖ హాలిడే స్పాట్స్‌లో సందడి చేస్తోంది.మూడున్నర పదుల వయసులోనూ ఫిట్‌నెస్‌పై ఎంతో శ్రద్ధ చూపించే త్రిష.. కెనడాలోని టోరంటో సి.ఎన్.టవర్‌లో 1168 అడుగుల ఎత్తులో ఎడ్జ్ వాక్ చేసి ఆశ్చర్యపరిచింది. ఈ అడ్వెంచరస్ పిక్స్‌ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. ‘భయం లేకుండా జీవించడమే జీవితానికి అర్థం.. నేను అలాగే జీవిస్తాను’ అంటూ ఓ కొటేషన్ కూడా తగిలించింది.