యవ్వనంగా కనిపించడానికి జీన్స్‌.. క్రమశిక్షణ.. త్యాగం కారణం!

“యవ్వనంగా కనిపించడానికి జీన్స్‌తో పాటు క్రమశిక్షణ, జీవితంలో కొన్నింటిని త్యాగం చేయడమూ ఓ కారణమని త్రిష చెప్పింది. కాలానికి మాత్రమే విఫల ప్రేమ జ్ఞాపకాల్ని మరిపించే శక్తి ఉంటుందని చెప్పింది . వైవిధ్యమైన కధలతో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నత్రిష ..ఇటీవల అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వారి ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలిచ్చింది .
భవిష్యత్తులో చేయాలనుకుంటున్న క్రేజీయెస్ట్‌ పని ఏదని ఓ అభిమాని అడగ్గా… “వేగాస్‌లో పెళ్లిచేసుకోవాలనుంద”ని త్రిష బదులిచ్చింది. ప్రస్తుతం పెళ్లి గురించి ఆలోచించడం లేదని, సినిమాలకే ప్రాధాన్యతనిస్తున్నానని చెప్పింది. ప్రేమకథల్లో నటించడాన్ని ఎంజాయ్‌ చేస్తానని, థ్రిల్లర్‌ సినిమాలు చూడటమంటే ఇష్టమని తెలిపింది.
దేనికి భయపడకుండా నిర్భయంగా ఉండే తత్వం పుట్టుకతోనే తనకు అబ్బిందని చెప్పింది. ఓటమి ఎదురైన ప్రతిసారి జీవితాన్ని నిలబెట్టిన గొప్ప విషయాల్ని గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యమని, అప్పుడే సానుకూల దృక్పథంతో ఆలోచించడం అలవడుతుందని పేర్కొన్నది. యవ్వనంగా కనిపించడానికి జీన్స్‌తో పాటు క్రమశిక్షణ, జీవితంలో కొన్నింటిని త్యాగం చేయడమూ ఓ కారణమని చెప్పింది. కర్మసిద్ధాంతాన్ని తాను పూర్తిగా విశ్వసిస్తానని అంది .
హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సక్సెస్‌ లేదు
త్రిష ఈ మధ్య నటించిన 96, పేట చిత్రాలు మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. త్రిష ‘పరమపదం విళైయాట్టు’కు టైమ్‌ వచ్చింది. త్రిష ప్రస్తుతం ‘రాంగీ’ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉంది. కాగా త్రిష ఇంతకుముందు నటించిన రెండు, మూడు చిత్రాలు నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు ఎదురుచూస్తున్నాయి. అందులో ఒకటి ‘పరమపదం విళైయాట్టు’. విశేషం ఏమిటంటే.. ఇది త్రిషకి 60వ చిత్రం కావడం. కే.తిరుజ్ఞానం తెరకెక్కించిన ఈ చిత్రం ట్రైలర్‌ ఇప్పటికే విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది.
ఇది యథార్థ సంఘటన ఇతివృత్తంతో తెరకెక్కించిన చిత్రం అని దర్శకుడు తెలిపారు.  త్రిష ఇందులో డాక్టర్‌గా నటించారని, కొందరు ఆమెను కిడ్నాప్‌ చేయడంతో వారెవరు, ఆమెను ఎందుకు కిడ్నాప్‌ చేశారు? వారి నుంచి ఎలా తప్పించుకుందన్న పలు ఆసక్తికరమైన అంశాలతో ‘పరమపదం విళైయాట్టు’ చిత్రం ఉంటుందని చెప్పారు. కాగా త్రిష నటించిన హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రం ఇది. నిజం చెప్పాలంటే త్రిష నటించిన హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రాలు ఇప్పటి వరకూ సక్సెస్‌ కాలేదు. ఈ చిత్రంలో యాక్షన్‌ సన్నివేశాలు కూడా ఉంటాయని తెలిసింది. దీని తరువాత నటి త్రిష నటించిన ‘గర్జన’ విడుదల ఉంది. ఇదీ హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రమే. ఇకపోతే ప్రస్తుతం నటిస్తున్న ‘రాంగీ’ చిత్రం కూడా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రమే. ఈ చిత్రం హిట్‌ అయితే కొత్త సంవత్సరంలోనూ త్రిష సక్సెస్‌ పయనం కొనసాగినట్లే అవుతుంది.
 
ప్రస్తుతం తెలుగులో చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తోంది.. తమిళంలో మణిరత్నం ‘పొన్నియన్‌ సెల్వన్‌’,‘1818’తో పాటు మరో మూడు చిత్రాల్లో నటిస్తున్నది త్రిష.