వారు చూసిన వ్యక్తిని మాత్రం పెళ్ళి చేసుకోను!

“పెళ్ళి విషయంలో పెద్దలు చెప్పిన మాట వినను. వారు చూసిన వ్యక్తిని మాత్రం చేసుకోను. ప్రేమించే చేసుకుంటాను. అదీ విదేశాల్లోనే చేసుకుంటాను”… అని చెబుతోంది హీరోయిన్‌ త్రిష. ఆమెకి పెళ్లి విషయంలో ఓ డ్రీమ్‌ ఉందట. ఈ మధ్య త్రిష తన అభిమానులతో సోషల్‌ మీడియాలో సరదాగా కాసేపు చాట్‌ చేస్తూ..వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ‘మీ క్రేజీ డ్రీమ్‌ ఏంటి?’ అని ఓ అభిమాని అడగ్గా – ‘‘వేగాస్‌లో వివాహం చేసుకోవాలని అనుకుంటున్నా’’ అని చెప్పింది త్రిష.
 
ఎలాంటి వ్యక్తిని చేసుకుంటానంటే…
నన్ను బాగా చూసుకునే వ్యక్తి అయి ఉండాలి. ఆ వ్యక్తి హీరో కానవసరం లేదు. అందచందాలతో పెద్దగా పనిలేదు. రంగు విషయంలో కూడా పట్టింపులు లేవు. ఎలా ఉన్నా ఫర్వాలేదు. మంచి మనసు ఉండాలి. నన్ను బాగా చూసుకోవాలి. అలాంటి వ్యక్తి తారస పడితే వెంటనే పెళ్లి చేసుకుంటానని త్రిష చెప్పింది.
 
‘నిర్మాతల సంఘం’ హెచ్చరికలు
త్రిష నటించిన హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రం ‘పరమపదం విళైయాట్టు’ చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమంలో పాల్గొనకపోవడంతో విమర్శలు ఎదుర్కొంది. ‘నిర్మాతల సంఘం’ హెచ్చరికలు చేసేవరకూ పరిస్థితిని తెచ్చుకుంది. దీని గురించి త్రిష పేర్కొంటూ.. “ప్రమోషన్లకు ఎగ్గొట్టే అలవాటు తనకు లేదని …షూటింగ్‌లకు కూడా చెప్పిన టైమ్‌కు స్పాట్‌లో ఉండి పూర్తి అయ్యేవరకూ ఉంటానని చెప్పింది. ఇటీవలి కాలంలో చూసుకోకుండా ఒకే సమయాన్ని ఇద్దరికి ఇవ్వడంతో ఇబ్బంది వచ్చింది. ఆ తరువాత టైమ్‌ అడ్జస్ట్‌ చేసుకుని రెండు కార్యక్రమాలకి హాజరయ్యాను. అప్పుడప్పుడు ఇలాంటివి కామన్‌. దానికి నేను నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నాను అనడం కరెక్ట్ కాదు”
 
మోహన్‌లాల్‌తో ‘రామ్‌’ సినిమా, మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ త్రిష చేస్తోంది. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లో ఆమె కుందవై మహారాణి పాత్రను చేస్తోంది. కల్కీ కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.త్వరలో ఆమె పాత్ర చిత్రీకరణ ప్రారంభం కానుంది. సినిమాలో తన పాత్రను పూర్తిగా అవగాహన చేసుకోవడానికి ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ నవలను త్రిష చదువుతోంది.