తులసి కె. విశ్వనాథ్‌ ‘శంకరాభరణం’ పురస్కారాల ప్రదానం !

‘శంకరాభరణం’ సినిమాలో నటించిన తులసి తన గురువు, కళాతపస్వి, దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్‌కు గౌరవ సూచకంగా  అవార్డుల ప్రదానానికి శ్రీకారం చుట్టారు. ‘శంకరాభరణం-2017’ సినీ అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం రాత్రి మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో ఘనంగా నిర్వహించారు. దీనికి హాజరై టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడారు….  భారత జాతి, తెలుగు జాతి గర్వించే గొప్ప దర్శకుడు కె.విశ్వనాథ్‌ అని టి.సుబ్బరామిరెడ్డి కొనియాడారు.ఈ సందర్భంగా కె.విశ్వనాథ్‌ను తులసి, టి.సుబ్బరామిరెడ్డి ఘనంగా సన్మానించారు.

ప్రదానోత్సవంలో భాగంగా అంధ కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం కార్యక్రమానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన పలు సినిమాల్లోని పాటలను యువ గాయకులు శ్రీకృష్ణ, రఘురాం, సాకేత్‌, గీతామాధురి, రమ్య, పర్ణిక ఆలాపించి ఆకట్టుకున్నారు. అంతేకాక పలువురు కళాకారులు భరత నాట్యం, కథక్‌ వంటి నృత్యాలతో ఆకట్టుకున్నారు.

శంకరాభరణం-2017 విజేతలు …..
ఉత్తమ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌(జనతా గ్యారేజ్‌), ఉత్తమ నటి రెజినా(జో అచ్యుతానంద), ఉత్తమ చిత్రం శతమానం భవతి, ఉత్తమ దర్శకుడు జూరి అవార్డు వేగేశ్న సతీష్‌(శతమానం భవతి), తమిళ కొత్త డైరెక్టర్‌(డైరెక్టర్‌ డెబ్యూ) ధనుష్‌, ఉత్తమ హాస్య నటుడు ప్రియదర్శి(మెట్రో), ఉత్తమ గాయకురాలు గీతా మాధురి, ఉత్తమ కొత్త కథానాయకుడు(డెబ్యూ హీరో) ఆకాశ్‌పూరి, ఉత్తమ సౌండ్‌ ఇంజినీర్‌ పప్పు, బెస్ట్‌ డైరెక్టర్‌ డెబ్యూ క్రిటిక్స్‌ తరుణ్‌ భాస్కర్‌, ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ సమీర్‌రెడ్డి, ఉత్తమ ఆర్ట్‌ డైరెక్టర్‌ రమణ వంక(శతమానం భవతి), లైఫ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు గాయకురాలు ఎస్‌పీ శైలజ.. వీటితో పాటు తెలుగు, తమిళ, మళయాళ భాషా చిత్రాలకు మరికొన్ని అవార్డులను ప్రదానం చేశారు.