సినిమా ఫట్.. పాట మాత్రం సూపర్ హిట్ !

సినిమా ఫట్ .. కాని పాట మాత్రం హిట్. తెలుగు, తమిళంలో విడుదలైన “ఓకే బంగారం”( త‌మిళంలో “ఓకే క‌ణ్మ‌ని”) చిత్రం. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రెండు భాషలలో మంచి విజయం సాధించి ఈ దర్శకుడికి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ క్రమంలో మణిరత్నం శిష్యుడు ఇదే చిత్రాన్ని హిందీలో “ఓకే జాను” టైటిల్ తో రీమేక్ చేశాడు. “ఆషికి2” జంట సిద్ధార్ధ్ రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో ఈ చిత్రం తెరకెక్కగా, ఎఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. బొంబాయి సినిమాలోని “హమ్మా.. హమ్మా” అనే పాటని రీమేక్ చేసి “ఓకే జాను” చిత్రం కోసం వాడారు . ఈ సాంగ్ యూ ట్యూబ్ లో 20 కోట్ల వ్యూస్ తో కళ్ళు చెదిరే రికార్డు సాధించింది. “సినిమా ఫట్ .. కాని పాట మాత్రం సూపర్ హిట్”. సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికి ఈ ఒక్క సాంగ్ కి వ‌స్తున్న‌ రెస్పాన్స్ చూసి యూనిట్ నమ్మలేకపోతోంది