అన్నిలెక్క‌లు చూసుకున్నాకనే ‘ఓకే’ !

తొలి చిత్రం ‘ఉప్పెన‌’తో కృతిశెట్టి తిరుగులేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది.దాంతో  కృతిశెట్టి రేంజ్ మారిపోయింది. ఆమెకు సినీ అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి. చాలామంది ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆమెతో సినిమా చేయాల‌ని ఆస‌క్తి చూపుతున్నారు. వ‌స్తున్న అవ‌కాశాల‌ను ఎంచుకోవ‌డంలో కృతిశెట్టి మాత్రం చాలా తెలివిగా వ్య‌వ‌హ‌రిస్తోంది. వ‌చ్చిన ప్రాజెక్టున‌ల్లా ఒప్పేసుకోవ‌డం లేదు. త‌న పాత్ర‌కు ప్రాధాన్య‌త ఉండ‌టంతో పాటు..రెమ్యున‌రేష‌న్ విష‌యంలోనూ లెక్క‌లు చూసుకుంటూ సినిమాల‌కు ఓకే చెబుతోంద‌ట. ఇద్ద‌రు హీరోయిన్స్ ఉన్న సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా చేయాలనో, గెస్ట్ అప్పియ‌రెన్స్ చేయాల‌నో ఎవ‌రైనా అడిగితే ఏమాత్రం.. ఆలోచించ‌కుండా ‘నో’ చెప్పేస్తుంద‌ని టాక్‌. రీసెంట్‌గా ఓ యంగ్ హీరో, పెద్ద బ్యాన‌ర్‌లో చేస్తున్న సినిమాలో  కృతిశెట్టిని గెస్ట్ అప్పియ‌రెన్స్ చేయ‌మ‌ని అడిగార‌ట‌. అయితే కృతి శెట్టి మొహ‌మాటం లేకుండా రిజెక్ట్ చేసింద‌నే వార్త‌లు నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్న‌ల్!…  ప్ర‌స్తుతం కృతిశెట్టి నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. తాజా స‌మాచారం మేర‌కు కృతి శెట్టి  మ‌రో చిత్రం చేయనుంద‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. వివ‌రాల్లోకెళ్తే.. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ త‌న రెండో త‌న‌యుడు గ‌ణేశ్‌ను హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నారు. ఇప్ప‌టికే గ‌ణేశ్ హీరోగా ఓ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. కాగా.. గణేశ్ హీరోగా, మ‌రో సినిమాను కూడా బెల్లంకొండ గ‌ణేశ్తో ట్రాక్ ఎక్కించేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. అందులో భాగంగా 2006లో షాహిద్ క‌పూర్‌, అమృతారావు జంట‌గా న‌టించిన చిత్రం ‘వివాహ్’ రీమేక్ హ‌క్కుల‌ను ద‌క్కించుకున్నార‌ట బెల్లంకొండ సురేశ్‌. ఇందులో గ‌ణేశ్ జోడీగా కృతిశెట్టిని న‌టింప చేయ‌డానికి చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌. అంతా ఓకే అయితే కృతి శెట్టి మ‌రో సినిమాకు ఓకే చెప్పేసిన‌ట్టేన‌ని వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

నిజాయితీగా, బోల్డ్‌గా ఉండాలి!… కృతి శెట్టి కి మనుషుల్లో ఒక్క విషయం అసలు నచ్చదట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతీని హోస్ట్‌ అబ్బాయిల్లో మీకు నచ్చని విషయం ఏంటని అడిగితే.. “అబద్దం చెప్పేవారంటే అసహ్యమని చెప్పింది. అది అబ్బాయిలైన, అమ్మాయిలైన అని పేర్కొంది….  “నిజాయితీగా, బోల్డ్‌గా ఉండే వ్య‌క్తులు నచ్చుతారని, ఏ విష‌య‌న్నైనా మొహ‌మాట‌ం లేకుండా ముఖం మీదే చెప్పేంత ధైర్యం ఉండాల‌ని చెప్పుకొచ్చింది ఈ బేబమ్మ. “తప్పు చేసినా కూడా భయపడకుండా నిజాయితిగా ఒప్పుకునే వ్యక్తిత్వం ఉన్న వారంటే ఇష్టమని, ఇక అబ్బాయిలు అబద్దం చెబితే తనకు అసలు నచ్చదని తెలిపింది. కాగా కృతీ ప్రస్తుతం నాని హీరోగా వస్తోన్న ‘శ్యామ్ సింగ‌రాయ్’ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. దీనితో పాటు సుధీర్‌బాబుతో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, రామ్‌ పోతినేనితో మరో సినిమాలో కృతీ హీరోయిన్‌గా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.