ఊర్వశీ రౌతేల హీరోయిన్ గా సంపత్ నంది ‘బ్లాక్ రోజ్’

శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్ పై పలు సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన నిర్మాత శ్రీనివాసా చిట్టూరి పవన్ కుమార్ సమర్పణలో ప్రొడక్షన్ నెం:4గా ‘బ్లాక్ రోజ్’ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది క్రియేట్ చేస్తున్న ఈ చిత్రానికి మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.
నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ – ” మేము నిర్మిస్తున్న ‘బ్లాక్ రోజ్’ చిత్ర యూనిట్ కి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆగస్ట్ 17 నుండీ నిర్విరామంగా షూటింగ్ జరుపుతున్నాము. రెండు సార్లు ‘మిస్ ఇండియా’ కిరీటాన్ని సాధించి, బాలీవుడ్ లో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన అందాల భామ ఊర్వశీ రౌతేల తెలుగులో ఎన్ని అవకాశాలు వచ్చినా చేయకుండా ‘బ్లాక్ రోజ్’ కథ విన్న వెంటనే ఇంప్రెస్ అయ్యి ఈ చిత్రం చేయడానికి అంగీకరించింది. చిత్రాన్ని ఒకే షెడ్యూల్ లో పూర్తి చేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్నాము.” అన్నారు
 
సంపత్ నంది మాట్లాడుతూ – ” షేక్స్ పియర్ రచించిన ‘ద మర్చంట్ ఆఫ్ వెనిస్’లో షైలాక్ అనే పాత్రని ఆధారంగా చేసుకుని ఫిమేల్ ఓరియంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్ గా ‘బ్లాక్ రోజ్’ తెరకెక్కుతోంది. ‘విచక్షణలేని, యోగ్యత లేని ఆర్థిక లావాదేవీలు మరణానికి సంకేతం’ అనే కౌటిల్యుడి అర్థ శాస్త్రం లోని కాన్సెప్ట్ ను జోడిస్తూ ‘బ్లాక్ రోజ్’ నిర్మిస్తున్నాం.” అన్నారు
ఈ చిత్రానికి రచన: సంపత్ నంది, మోహన్ భరద్వాజ్,
డిఓపి: సౌందర్ రాజన్,సంగీతం: మణిశర్మ