ఆనంద్, సురభి రిలీజ్ చేసిన షార్ట్ ఫిల్మ్ ‘If She Only Knew’

లెక్కలేసుకుని ప్రేమలో పడటం, అనుకోకుండా ప్రేమలో పడటం, మనల్ని అర్థం చేసుకొని భరించే ఫ్రెండ్ తో లైఫ్ లాంగ్ కలిసి బ్రతికేద్దామని డిసైడ్ అయి ప్రేమలో పడటం. ‘ఒక్కక్షణం’ డైరెక్టర్ V.I. ఆనంద్, హీరోయిన్ సురభిల చేతుల మీదుగా రిలీజైన ‘If She Only Knew’ షార్ట్ ఫిలిం మూడో క్యాటగిరీకి వస్తుంది. ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ తో ఐదేళ్ళు దూరమైన ప్రేమ జంటలో, అంతే ప్రేమ ఉంటుందా…? స్నేహం అనే పునాదిపై చిగురించిన ఆ ప్రేమలో నిజంగా నిజాయితీ ఉంటుందా..? అనేదే ఈ షార్ట్ ఫిలిం ప్రధాన కథాంశం.  

గిరీష్, మోనా, హష్మి హచ్ నటించిన ఈ షార్ట్ ఫిల్మ్ ని అమరేంద్ర బాబు పొందూరి నిర్మించారు. అజయ్ అరసాడ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాకి వెంకట కృష్ణ చిక్కాల ఎడిటర్. సాయేషా ఖాతూన్ డైరెక్టర్.