ఏజ్‌కు త‌గిన క‌థ‌కు అతనే హీరో !

ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ కు నటించాలనే కోరిక ఎప్పటినుంచో ఉంది.ఈ విషయం లో చాలాసార్లు చర్చలు జరిగాయని అంటారు.అయితే దర్శకుడిగా బిజీగా ఉండటం వాళ్ళ వర్కవుట్ కాలేదు. అయితే దర్శకుడిగా ఇప్పుడు అతనికి వరుస అపజయాలు రావడంతో కొంత విరామం ఏర్పడింది. ఇప్పుడు వినాయ‌క్  ఏ సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్నారా? అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న త‌రుణంలో ఓ షాకింగ్ న్యూస్ తెలిసింది. అదేంటంటే… వినాయ‌క్ హీరోగా మారుతున్నారు.
త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ వ‌ద్ద‌ కో డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన న‌ర‌సింహారావు వినాయ‌క్‌ను హీరోగా డైరెక్ట్ చేయ‌నున్నారు. వినాయక్ కు వినాయ‌క్ ఏజ్‌కు త‌గిన క‌థ‌తో ఈ సినిమా రూపొంద‌నుంది. ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాను నిర్మించ‌బోతున్నారు.డైరెక్ట‌ర్‌గా న‌ర‌సింహారావు తొలి సినిమాగా`శ‌ర‌భ‌`ను డైరెక్ట్ చేశారు. ఇప్పుడు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రాబోయే సినిమా ఇదే కానుంది. గ‌తంలో `ఠాగూర్` స‌హా ప‌లు చిత్రాల్లో న‌టుడిగా వెండితెర‌పై మెరిసిన వినాయ‌క్‌.. ఇప్పుడు ఏకంగా హీరోగా మెప్పించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు.ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను దిల్‌రాజు తెలియ‌జేస్తారు.