దర్జీల జీవిత సారం ‘మారిపోయెరా కాలం’

దర్జీల జీవిత సారమే ‘మారిపోయెరా కాలం’ నవల కధ  అని సీనియర్ టైలర్  యాక్స్ టైలర్స్  వ్యవస్థాపకుడు యర్రం శెట్టి వాలేశ్వరరావు అన్నారు .  ‘విజయవాడ  టైలర్స్ అసోసియేషన్’ అద్వర్యం లో  వి.వెంకటరావు రాసిన ‘మారిపోయెరా కాలం’ నవలను జులై 9న విజయవాడ మాకినేని బసవ  పున్నయ్య హాల్ లో యర్రం శెట్టి వాలేశ్వరరావు ఆవిష్కరించారు . మారుతున్న  కాలం తో పాటు ప్రజల అభిరుచిలోనూ  మార్పు వస్తోందని, ఈ నేపధ్యం లో తొలిసారి  టైలర్ల జీవితాన్ని నవల ద్వారా ఆవిష్కరించిన వెంకట్రావు అభినందనీయుడని  అన్నారు . టైలర్  మనుషుల ఆత్మీయ బంధువని పేర్కొన్నారు .

సీనియర్ కవి అరసవిల్లి కృష్ణ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమం లో పుస్తక రచయిత వెంకట్రావు మాట్లాడుతూ ….     టైలర్ల   జీవితాలను  ఈ నవల ద్వారా చూపించానని అన్నారు .  పుస్తక ప్రచురణ కర్త  యన్. కె .పబ్లికేషన్స్ బాబు, బి. వి.దుర్గారావు  తదితరులు ఈకార్యక్రమంలో పాల్గొని రచయిత వెంకట్రావు కృషిని అభినందించారు .   … ఆంధ్రభూమి వారపత్రికలో ‘మారిపోయెరా కాలం’ ఆరు నెల్ల పాటు సీరియల్ గా ప్రచురింపబడి  విశేష ఆదరణ పొందింది . ఈ పుస్తకం  విజయవాడ ఏలూరురోడ్ లోని ‘అనేక బుక్ హౌస్’లో  దొరుకుతుంది .