నిర్మాతల విభాగం అధ్యక్షునిగా వల్లూరిపల్లి రమేష్

మహర్షి సినిమా పతాకంపై ‘అశోక్’, ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’, ‘కబడ్డీ కబడ్డీ’, ‘గోపి గోపిక గోదావరి’ వంటి పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత వల్లూరిపల్లి రమేష్.. తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి నిర్మాతల విభాగం అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా బోడపాటి మురళి,రాజేశ్వరి, ఉపాధ్యక్షులుగా పద్మిని,బాబ్జి ఎంపికయ్యారు. వల్లూరిపల్లి ఎన్నిక పట్ల జెమిని కిరణ్, సి.కళ్యాణ్ తదితర చిత్ర ప్రముఖులు హర్షం వ్యక్తం చేసి, రమేష్ ను అభినందించారు. వల్లూరిపల్లి ,ఆయన కార్యవర్గం రెండేళ్లపాటు ఈ పదవుల్లో కొనసాగుతారు.