పి.జనార్దన్ రెడ్డి నిర్మించిన హర్రర్ విత్ టెర్రర్ ట్రైలర్

హర్రర్ విత్ టెర్రర్  హర్రర్ విత్ టెర్రర్ ట్రైలర్ ను ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్  చేతుల మీదుగా ఘనంగా లాంచ్ చేయడం జరిగింది.
 సి.కళ్యాణ్ మాట్లాడుతూ… చిన్న సినిమాలైనా క్వాలిటీతో చిత్రాన్ని నిర్మిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు. దర్శకుడు వంశీ రాజు నాకు కొన్ని సంవత్సరాలుగా పరిచయం. ఈ చిత్ర ట్రైలర్ చాలా బాగుంది. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని అన్నారు.
చిత్ర నిర్మాత జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ … మా సొంత బ్యానర్ లో గత కొంత సంవత్సరాలుగా పలు చిత్రాలు నిర్మించడం జరిగింది. దర్శకుడు వంశీ రాజు మంచి దర్శకుడు అని భవిష్యత్తులో పెద్ద దర్శకుడు అవుతాడు. ఈ చిత్రం ప్రేక్షకులు ఘన విజయం సాధించేలా చేయాలని ఆయన అన్నారు.
చిత్ర దర్శకుడు వంశీ రాజు మాట్లాడుతూ … హర్రర్ విత్  టెర్రర్ ఈ చిత్రం లాక్డౌన్ సమయంలో కథా చర్చలతో ప్రారంభమై షూటింగ్ ప్రారంభించి పూర్తి చేయడం జరిగింది. చిన్న సినిమా అయినా మంచి క్వాలిటీతో నిర్మించడం జరిగింది. నిర్మాత జనార్దన్ రెడ్డి సహకారంతో చిత్రాన్ని పూర్తి చేయడం జరిగింది  అన్నారు.

నిర్మాత దర్శకుడు సాయి వెంకట్ మాట్లాడుతూ … హారర్ కధా చిత్రం క్వాలిటీ వెనుకాడకుండా నిర్మాత తీయడం చాలా సంతోషం ఈ చిత్రంలో అందమైన 46 మంది అమ్మాయిలు నటించారు ఈ చిత్రం మంచి విజయం సాధించి నిర్మాత జనార్దన్ రెడ్డికి మరిన్ని చిత్రాలు తీయాలని అన్నారు
నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ… వంశీ రాజు మంచి అభిరుచిగల దర్శకుడు  చిత్రం ట్రైలర్ చాలా బాగుంది. నిర్మాతకు మంచి లాభాలు వచ్చి మరిన్ని చిత్రాలు తీయాలన్నారు
దర్శక నిర్మాత సత్యా రెడ్డి మాట్లాడుతూ… నిర్మాత జనార్దన్ రెడ్డి గత 20 సంవత్సరాల నుండి చిత్రపరిశ్రమలో ఉంటున్నాడు .దర్శకుడు చాలా కష్టపడి హారర్ విత్ చిత్రాన్ని రూపొందించాడు నిర్మాతకు మంచి లాభాలు రావాలని అన్నారు.
పీజేఆర్ ఫిలింస్ బ్యానర్ పై ఇందిరా ఆర్ట్ క్రియేషన్స్ టి రాజు సమర్పణలో పి.జనార్దన్రెడ్డి నిర్మాతగా వంశీరాజు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి రచయిత.రంగనాద్, కెమెరా. సుధాకర్ నాయుడు, సంగీత దర్శకుడు. అర్జున్ ప్రసాద్.