`శ్రీక‌రం శుభ‌క‌రం నారాయ‌ణీయం`

గోదాశ్రీ క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందిన చిత్రం `శ్రీక‌రం శుభ‌క‌రం నారాయ‌ణీయం`. నిమ్మ‌ని ప్ర‌శాంత్ క‌థానాయ‌కుడు. ఐన్‌థ్రిల్లా చ‌క్ర‌వ‌ర్తి నాయిక‌. వాన‌మామ‌లై కృష్ణ‌దేవ్ ద‌ర్శ‌కుడు. ఆయ‌నే నిర్మిస్తున్నారు. తార‌క రామారావు సంగీతాన్ని అందిస్తున్నారు.ఈ సినిమా ప్రారంభోత్స‌వం హైద‌రాబాద్‌లో బుధ‌వారం జ‌రిగింది.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ “ప్ర‌స్తుతం పాశ్చాత్య ప్ర‌భావిత యువ‌త‌ను భార‌తీయ స‌నాత‌న స‌మాజానికి దూరం కాకుండా, అవ‌స‌ర‌మైన ఆనంద అహ్లాదాల‌తో కూడుకుని ప్ర‌గ‌తి మార్గంలో విజ‌యం పొందేందుకు దైనందిన జీవితంలో దైవ‌రాధ‌న‌తో ప్రారంభించి ఆధ్యాత్మిక చింత‌న‌ను అల‌వ‌ర‌చుకునే విధంగా తీర్చిద్దుతాం. సాంప్ర‌దాయ కుటుంబ యువ‌తి, అలాగే దీనికి ప్ర‌భావితం అయిన‌టువంటి సామాన్య యువ‌కుని విజ‌య ప‌రంపర ఈ చిత్రానికి మూల క‌థ‌“ అని చెప్పారు.

ఈ సినిమాకు కెమెరా: రామ్ శ్రీనివాస్‌, సంగీతం: తార‌క రామారావు.