వరుణ్ తేజ్, సంకల్ప్ రెడ్డి సినిమా డిసెంబర్ 21న

వరుణ్ తేజ్,  సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, ఆదితిరావు హైదరీ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేం ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
 
ఇందులో హాలీవుడ్ తరహా స్టంట్స్ ఉండబోతున్నాయి. అందుకోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ జిబెక్, టోడోర్ లాజరవ్ (జూజి), మరియు రోమన్ వర్క్ చెయ్యడం జరిగింది. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ అధితి రావ్ హైద్రి పై 3డి స్కాన్ చెయ్యడం జరిగింది. సినిమాకు ఈ టెక్నాలజీ మరింత హెల్ప్ కానుంది. గతంలో వీరు ఎక్ష్పపాండబుల్స్2, ట్రాయ్, జీరో డార్క్ థట్టి, హీర్సులేస్, ది ఇంవీసిబుల్, లొవింగ్ పాబ్లో, రీబార్న్, స్నిప్పెట్, మార్కో పోలో, గేమ్ అఫ్ త్రోన్స్ వంటి హాలివుడ్ చిత్రాలకు వీరు పని చేసారు.
 
నటీనటులు:
వరుణ్ తేజ్, అదితిరావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్, రాజా, అవసరాల శ్రీనివాస్, రెహ్మాన్ (రఘు) తదితరులు.
 
సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: సంకల్ప్ రెడ్డి.
నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి
కెమెరా:జ్ఞానశేఖర్ వి.ఎస్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
ప్రొడక్షన్ డిజైనర్స్: రామకృష్ణ సబ్బాని- మౌనిక నిగొత్రే సబ్బాని
సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారీ
డైలాగ్స్: కిట్టు విస్సాప్రగడ
కాస్ట్యూమ్స్: అశ్వంత్ బైరి
స్టంట్స్: టోడోర్ లాజారోవ్, సి.జి: రాజీవ్ రాజశేఖరన్
ఎస్.ఎఫ్.ఎక్స్: మైష్ త్యాగి
పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్