రీజనింగ్ కరెక్ట్ గా ఉంటే పాత్రకు న్యాయం జరుగుతుంది!

“మెగా ప్రిన్స్‌” వరుణ్‌ తేజ్‌ ‘ముకుంద’, ‘కంచె’, ‘లోఫర్‌’ ‘అంతరిక్షం’ లాంటి విభిన్నకథా చిత్రాలతో …’ఫిదా’, ‘తొలిప్రేమ’, ‘ఎఫ్‌ 2’ లాంటి సక్సెస్‌ ఫుల్‌ కమర్షియల్‌ చిత్రాలతో ముందడుగులో ఉన్నారు. వరుణ్‌ తేజ్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ‘వాల్మీకి’. సెప్టెంబర్‌ 20న విడుదలవుతున్న సందర్భంగా వరుణ్‌ తేజ్‌ తో ఇంటర్వ్యూ….
 
మాస్‌ క్యారెక్టర్‌ చేయడం ఎలా అనిపించింది
– ఈ మాస్‌ అనుభవం కొత్తగా ఉంది. మనం ఏ క్యారెక్టర్‌ చేసినా క్యారెక్టరైజేషన్‌ రీజన్‌ కరెక్ట్‌గా ఉండాలి. అప్పుడే దానికి పూర్తి న్యాయం జరుగుతుంది. ఇందులో గద్దలకొండ గణేష్‌ క్యారెక్టర్‌ భయంకరంగా ఎందుకు ఉంటుందో…కరెక్ట్‌ రీజన్‌ చూపించారు హరీష్‌ శంకర్‌. అందుకే ఎంజాయ్‌ చేస్తూ చేశాను.
 
అలా ఈ ప్రాజెక్ట్‌ ఓకే అయింది
– చాలా మంది దర్శకులలాగానే హరీష్‌ కూడా లవ్‌స్టోరీతో వచ్చారు. ఆయన చెప్పిన ‘దాగుడుమూతలు’ కథ అద్భుతంగా ఉంది. అయితే.. ఇలాంటి లవ్‌ స్టోరీస్‌ మీరు చేయరు కదా? అని అడిగాను. ఫిదా, తొలిప్రేమ చిత్రాలు చేశారు.అందుకే మీకు ఇంట్రెస్ట్‌ ఉందేమో.. అని ఈ కథ అన్నారు. ‘మీతో మీతరహా ఎంటర్‌టైనర్‌ చేద్దాం’ అనుకుంటున్నాను అన్నాను. దాంతో హరీష్‌ ‘జిగర్తాండ’ చూశావా? అని అడిగారు.అలా ఈ ప్రాజెక్ట్‌ ఓకే అయింది.
 
ఎలాంటి మార్పులు చేశారు
-‘జిగర్తాండ’ చాలా మంచి స్క్రిప్ట్‌. దాని ఫీల్ పోకుండా మన నేటివిటీకి తగ్గట్లు సగం మార్పులు చేశాం. గద్దల కొండ గణేష్‌ క్యారెక్టర్‌ చూపుతూ.. ఫ్లాష్‌ బ్యాక్‌ పెట్టి నిడివి కొంచెం పెంచాం.  కొన్ని సీన్లు అలాగే పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.
నా స్నేహితులు కొంతమంది నాకు ఇది కరెక్ట్‌ కాదేమో ఆలోచించుకో అన్నారు.. చిరంజీవి గారికి ఫోన్‌ చేసి.. ‘డాడీ కథ ఇలా అనుకుంటున్నాను’ అన్నాను. హరీష్‌ నేను వెళ్లి కలిసాం… ‘కథ చాలా బాగుంది .నువ్వు తప్పకుండా చెయ్యి’ అని చిన్న చిన్న సూచనలు ఇచ్చారు. హరీష్‌ వాటిని అప్లై చేశారు.
 
బాగా రావడానికి హరీష్‌ ముఖ్య కారణం
-ఈ క్యారెక్టర్‌ను బాగా చేయడానికి హరీష్‌ గారు చాలా హెల్ప్‌ చేశారు. ఎఫ్‌2 లో తెలంగాణ కొంచెం నీట్‌గా ఉంటుంది కానీ, ఇందులో తెలంగాణ యాస కొంచెం కొట్టినట్లు ఉంటుంది. హరీష్‌ డైలాగ్స్‌ కూడా సినిమాకు చాలా హెల్ప్‌ అవుతాయి. హరీష్‌ ఈ సినిమా బాగా రావడానికి ముఖ్య కారణం
‘ఎల్లువచ్చి గోదారమ్మ’ రీమిక్స్‌
– జనరల్‌గా నాకు పాట అంటేనే కొంచం ప్రజర్ ఉంటుంది. అలానే ఫీల్‌ అయ్యాను అంతే. హరీష్‌ గారు ఈ పాట మీద కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. దాని గురించి ఆయనకే ఎక్కువ తెలుసు. మిగతా విభాగాల వారు కరెక్ట్‌గా చేశారు. నేను డాన్స్‌ చేశాను అంతే. ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో ఆ పాటకు వచ్చిన రెస్పాన్స్‌ నేను ముందుగా ఊహించలేదు
 
సినిమాకు పూజ ఒక ప్లజంట్‌ ఫీలింగ్‌
– నాలుగు సంవత్సరాల కిందట పూజతో ‘ముకుంద’ సినిమా చేశాను. మళ్ళీ ఇప్పుడు వాల్మీకి చేసాం. ‘ముకుంద’ పూజతో యానాంలో షూట్‌ చేశాం. ఇప్పుడు ‘ఎల్లువచ్చి గోదారమ్మ’ సాంగ్‌ అదే యానాంలో షూటి చేశాం. పూజ యాక్టింగ్‌, డాన్స్‌ లో చాలా డవలప్ అయింది.ఇందులో దేవి క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్‌గా కుదిరింది. ఈ సినిమాకు ఆమె ఒక ప్లజంట్‌ ఫీలింగ్‌ తీసుకువస్తుంది.
 
అధర్వ మురళి బాగా నటించాడు
– అధర్వ ఒక ఆస్పైరింగ్‌ డైరెక్టర్‌ క్యారెక్టర్‌లో బాగా నటించాడు. తనకు తెలుగు రాకపోయినా డైలాగ్స్‌ నేర్చుకొని మరి చెప్పాడు.
 
డబ్బింగ్‌ చెప్పడానికి ఎక్కువ టైమ్‌
– చాలా ఎక్కువ తీసుకున్నా. ఈ సినిమాలో ఇంటర్వెల్‌ ముందు ఇరవై నిమిషాల సీక్వెన్స్‌ సినిమాకు చాలా కీలకం. సినిమాలో మేజర్‌ ట్విస్ట్‌ .పెర్ఫామెన్స్‌కి బాగా స్కోప్‌ ఉన్న సీన్‌. రకరకాల ఎమోషన్స్‌చెయ్యాలి. అది థియేటర్ లో ప్రేక్షకులకి థ్రిల్ కలిగిస్తుంది. అటువంటి సీన్లు కొన్ని ఉన్నాయి. అందుకే కొంచెం సమయం ఎక్కువ తీసుకున్నాను