వ‌రుణ్‌తేజ్‌, వెంకీ అట్లూరి కాంబినేష‌న్‌లో చిత్రం

వ‌రుణ్‌తేజ్ హీరోగా శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్రం ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం శ‌నివారం హైద‌రాబాద్ ఫిలింన‌గ‌ర్‌లోని దైవ స‌న్నిధానంలో ప్రారంభ‌మైంది. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి బివిఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మాత. జ్యోతిర్మ‌యి గ్రూప్స్ చిత్ర స‌మ‌ర్ప‌కులు. హీరో హీరోయిన్‌ల‌పై తొలి స‌న్నివేశానికి ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి క్లాప్ కొట్టారు. ఈ సంద‌ర్భంగా…
 నాగ‌బాబు మాట్లాడుతూ – “ఎస్‌విసిసి బ్యాన‌ర్‌లో రూపొంద‌నున్న సినిమా ఇది. నిర్మాత‌లు బివిఎస్ఎన్ ప్ర‌సాద్, బాపినీడుకి అభినంద‌న‌లు. వెంకీ అట్లూరి మంచి రైట‌ర్‌. ఇప్పుడు వ‌రుణ్‌తో మంచి యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ తెర‌కెక్కించ‌నున్నాడు. ఈ సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటూ వెంకీకి నా అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను. వ‌రుణ్‌, రాశిఖ‌న్నా స‌హా ప్ర‌తి ఆర్టిస్ట్‌, టెక్నిషియ‌న్‌కు ఆల్ ది బెస్ట్‌“ అన్నారు.
వ‌రుణ్ తేజ్ మాట్లాడుతూ – “బాపినీడు, బివిఎస్ఎన్ ప్ర‌సాద్‌గారు నిర్మాత‌లుగా కొత్త సినిమా చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. వెంకీ అట్లూరి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. వెంకీ అట్లూరి నాకు మంచి స్నేహితుడు. మంచి క‌థ‌ను రాసుకున్న త‌ను నాకు వినిపించాడు. రొమాంటిక్ కామెడి ఎంట‌ర్‌టైన‌ర్. ఒక ల‌వ్‌స్టోరీలోని ప‌దేళ్ళ జ‌ర్నీని ఓ సినిమా చేయ‌బోతున్నాం. జార్జ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. రాశిఖ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. మంచి టీం క‌లిసి చేస్తున్న ప్ర‌య‌త్నం“ అన్నారు.
వెంకీ అట్లూరి మాట్లాడుతూ – “ద‌ర్శ‌కుడిగా ఇది నా తొలి చిత్రం. ఇంత‌కు ముందు కొన్ని చిత్రాల‌కు రైట‌ర్‌గా ప‌నిచేశాను. వ‌రుణ్ లాంటి హీరోతో ఇంత పెద్ద బ్యాన‌ర్‌లో సినిమా చేయ‌డం  అదృష్టంగా భావిస్తున్నాను“ అన్నారు.