జూలై 21న ప్ర‌పంచ వ్యాప్తంగా `ఫిదా`

`ముకుంద‌, కంచె వంటి విల‌క్ష‌ణ చిత్రాల‌తో మెప్పించిన మెగా హీరో వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ నిర్మిస్తోన్న చిత్రం `ఫిదా`. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తుంది. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా ట్రైల‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. శ‌క్తికాంత్ సంగీత సారథ్యంలో విడుద‌లైన పాట‌ల‌కు ప్రేక్ష‌కుల నుండి అద్భుమైన స్పంద‌న వ‌చ్చింది. జూలై 10న పాట‌ల‌ను విడుద‌ల చేస్తారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ సినిమాను జూలై 21న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రానికి స‌హ నిర్మాతః హ‌ర్షిత్‌, నిర్మాత‌లుః దిల్‌రాజు, శిరీష్‌, ద‌ర్శ‌కత్వంః శేఖ‌ర్ క‌మ్ముల‌