వెంకటేష్ -నాగ చైతన్య `వెంకీ మామ` సినిమా ఫస్ట్ లుక్

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య కథానాయకులుగా నటిస్తున్న `వెంకీ మామ` సినిమా ఫస్ట్ లుక్ ను ఉగాది సందర్భంగా విడుదల చేశారు. కె ఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. పాయల్ రాజ్ పుత్, రాశీ ఖన్నా నాయికలు. సురేష్ బాబు, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఎస్.ఎస్.తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు . ఈ చిత్రానికి వివేక్ కూచిబొట్ల సహ నిర్మాత.
వెంకీ మామ ఫస్ట్ లుక్ పోస్టర్ లో వెంకటేష్ నాగ చైతన్య నవ్వుతూ కనిపించడం అభిమానుల్లో నిజమైన పండుగ వాతావరణాన్ని తెచ్చింది. వెంకీ మామ ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా బావుందని అక్కినేని, దగ్గుబాటి అభిమానులు సోషల్ మీడియాలో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
వెంకీ మామ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ రాజమండ్రిలో ఇటీవల పూర్తయిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 8 నుంచి హైదరాబాదులో తాజా షెడ్యూల్ మొదలుకానుంది.
 
Venkatesh and Naga Chaitanya’s ‘Venky Mama’ First Look
The first look of ‘Venky Mama’ starring ‘victory’ Venkatesh and Akkineni Naga Chaitanya in the lead roles is unveiled on the occasion of Ugadi festival.
The poster has Venkatesh and Naga Chaitanya with a smile on their faces. It gives a good vibe to the Akkineni and Daggubati fans.
‘Venky Mama’ is touted to be a thorough entertainer.
Recently the film has wrapped up the first schedule of shooting that took place in Rajahmundry. The second schedule will resume from April 8th in Hyderabad.
KS Ravindra (Bobby) is directing the movie while Raashi Khanna and Paayal Rajput will be seen opposite to Chay and Venky respectively.
 
Cast: Venkatesh, Naga Chaitanya, Raashi Khanna, Paayal Rajput
Crew: Director: KS Ravindra (Bobby)
Producers: Suresh Babu, TG Vishwa Prasad
Co-producer: Vivek Kuchibhotla
Music: SS Thaman
Suresh Productions, People Media Factory