విక్రమ్‌ వేదా’ రీమేక్‌ లో బాబాయ్ అబ్బాయ్

తమిళంలో తెరకెక్కిన ‘విక్రమ్‌ వేదా’ సినిమా ఇటీవల విడుదలై బాక్ల్‌బస్టర్‌ హిట్‌ దిశగా సాగుతోంది. మాధవన్‌, విజయ్‌ సేతుపతి హీరోలుగా ఇటు దేశంలోనూ, అటు విదేశాల్లోనూ భారీ వసూళ్లు రాబడుతున్న ఈ సినిమా తెలుగులోకి రీమేక్‌ కానుంది. రానా దగ్గుబాటి, వెంకటేష్‌తో ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేసేందుకు చర్చలు ప్రారంభించాం. ‘విక్రమ్‌ వేదా’ విడుదలకు ముందే రీమేక్‌లో వారిని ఫస్ట్ చాయిస్‌గా భావించాం. అయితే, ఇంకా ఏది ఫైనలైజ్‌ కాలేదు. ఈ ప్రక్రియకు మరికొన్ని నెలల సమయం పట్టవచ్చు …. అని చిత్రవర్గాలు ఐఏఎన్‌ఎస్‌ వార్తాసంస్థకు తెలిపారు.

పుష్కర్‌ గాయత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ. 40 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. గతవారం విడుదలైన ఈ సినిమా ఇటు విమర్శకులు, అటు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. విక్రమ్‌ భేతాళ్‌ జానపద కథల స్ఫూర్తితో పోలీసు-గ్యాంగ్‌స్టర్‌ బ్యాక్‌డ్రాప్‌తో సాగే ఈ సినిమాలో మాధవన్‌ ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా నటించగా.. విజయ్‌ సేతుపతి గ్యాంగ్‌స్టర్‌గా తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడు.