‘వెంకీమామ’ తొలి షెడ్యూల్ రాజ‌మండ్రిలో

‘వెంకీమామ’… మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌. ఇటీవ‌ల ఎఫ్‌2 అనే కామిక్ మ‌ల్టీ స్టార‌ర్‌తో అల‌రించిన వెంకీ త్వ‌ర‌లో ‘వెంకీమామ’ అనే మ‌రో మ‌ల్టీ స్టార‌ర్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌నున్నాడు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక‌క్క‌నున్న ఈ చిత్రంలో నాగ చైత‌న్య కూడా ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు. శ్రియా శ‌ర‌న్, ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థానాయిక‌లుగా న‌టించ‌నున్నారు. ఫిబ్ర‌వరి 22న చిత్రం సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రం విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ఉంటుంద‌ని , తొలి షెడ్యూల్‌ని రాజ‌మండ్రిలో జ‌ర‌పాల‌ని చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ షెడ్యూల్‌లో చిత్రానికి సంబంధించి కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్కించ‌నున్నార‌ట‌. ఈ సినిమాని కోన కార్పోరేష‌న్‌, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ద‌గ్గుబాటి రానా కూడా ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషించ‌నున్నాడ‌ని అంటున్నారు.