విక్ట‌రీ వెంక‌టేశ్‌, వ‌రుణ్ తేజ్ తో అనిల్ రావిపూడి `ఎఫ్ 2`

విభిన్న‌మైన సినిమాలు, పాత్ర‌లు చేస్తూ కొత్త‌దనానికి పెద్ద పీట వేసే స్టార్ హీరో విక్ట‌రీ వెంకటేష్… ‘ఫిదా’, ‘తొలి ప్రేమ’ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సాధించిన యువ క‌థానాయ‌కుడు వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్‌లో ఓ మ‌ల్టీస్టార‌ర్ రూపొంద‌నుంది. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో రూపొంద‌నున్న ఈ సినిమాను యంగ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కించ‌నున్నారు. `ప‌టాస్‌`, `సుప్రీమ్‌`, `రాజా ది గ్రేట్‌` హ్యాట్రిక్ విజ‌యాల త‌ర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయ‌నున్న ఈ సినిమాకు `ఎఫ్ 2` టైటిల్‌ను ఖ‌రారు చేశారు. `ఫ‌న్ అండ్ ఫ‌స్ట్రేష‌న్ ఉప‌శీర్షిక‌. మంచి మెసేజ్‌తో పాటు ఔట్ అండ్ ఔట్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను తెర‌కెక్కించడంలో మంచి ప‌ట్టు ఉన్న అనిల్ రావిపూడి `ఎఫ్ 2` సినిమాను కూడా పూర్తిస్థాయి కుటుంబ క‌థా చిత్రంగా తెర‌కెక్కించనున్నారు. జూలై నుండి సినిమా ప్రారంభమ‌వుతుంది. త్వ‌ర‌లోనే ఇత‌ర న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని యూనిట్ స‌భ్యులు తెలిపారు.