ఇందిర బయోపిక్‌ కోసం భారీ ఎత్తున రీసెర్చ్‌

ఇందిరా గాంధీ… జీవితకధ ఆధారంగా చేస్తున్నది సినిమా కాదని… వెబ్‌ సిరీస్‌ అని తేల్చి చెప్పారు విద్యాబాలన్‌.మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా ఓ చిత్రం రూపొందనుందని ఇప్పటి వరకూ ప్రచారం జరిగింది. ఇందిరా గాంధీగా విద్యాబాలన్‌ చేయనుంది. ఇప్పటివరకూ అందరూ ఇదొక సినిమా చేస్తున్నారని అనుకున్నా…ఇది చిత్రం కాదని వెబ్‌ సిరీస్‌ అని తేల్చి చెప్పారు విద్యాబాలన్‌. సినిమాకు బదులు ఇప్పుడు వెబ్‌ సిరీస్‌ చేయాలనే నిర్ణయం మార్చడానికి కారణాన్ని ఆమె వివరించారు…
ఏదో ఒక సినిమాగానో, ఒక పార్టులోనే మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితం మొత్తాన్ని చూపించలేమని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ సిరీస్‌ ప్రస్తుతం స్క్రిప్ట్‌ వివిద దశలో ఉందని త్వరలో పూర్తవుతుందని విద్య పేర్కొన్నారు. ఇందిర బయోపిక్‌ కోసం భారీ ఎత్తున రీసెర్చ్‌ చేయాల్సి వస్తుందన్నారు. ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్లనుందో మాత్రం కచ్చితంగా చెప్పకలేకపోయారు. సాగరిక ఘోష్ రాసిన  ‘ఇందిర -ఇండియాస్  మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్’  పుస్తకం ఆధారంగా తెరకెక్కించబోతున్నట్టు చెప్పారు. ఈ సిరీస్‌ నిర్మాణానికి గాంధీ కుటుంబ అనుమతి అక్కర్లేదని పునరుద్ఘాటించారు. డిజిటల్‌ మీడియాలో విద్యాబాలన్‌ చేస్తున్న మొదటి ప్రాజెక్టు ఇదే .
 
ముందు మీ మైండ్‌ సెట్‌ మారాలి !
‘జీరో సైజ్‌’ హీరోయిన్లను ‘కొంచెం బరువు పెరిగితే బాగుంటుంది’ అంటారు. కొంచెం బొద్దుగా ఉండే కథానాయికలను ‘ఎప్పుడు సన్నబడతారు?’ అనడుగుతారు. ఎలా ఉన్నా ఏదొకటి అంటారు. కొందరు హీరోయిన్లు ఇలాంటి కామెంట్స్‌ని లైట్‌ తీసుకుంటారు. నిన్న మొన్నటివరకూ విద్యాబాలన్‌ అలానే తీసుకున్నారు. కానీ, ఇక ఇలాంటి ప్రశ్నలడిగితే క్షమించేది లేదన్నట్లు ఘాటుగా స్పందించారు….
 
ఈ మధ్య ఓ సినిమా ప్రచారంలో పాల్గొన్న విద్యాబాలన్‌ని.. ‘ప్రస్తుతం మీరు లావుగా ఉన్నారు.ఎప్పుడు సన్నబడి గ్లామర్‌ రోల్స్‌ చేస్తారు?’ అని ఓ విలేకరి అడిగారు. ‘‘ఏం మాట్లాడుతున్నారు? గ్లామర్‌గా కనిపించాలంటే సన్నబడాలా? సన్నగా ఉంటేనే అవకాశాలొస్తాయా? అయినా, నేను ప్రస్తుతం బరువు తగ్గాల్సిన అవసరం లేదు. నాకు వస్తున్న పాత్రలకు నాజూకుగా ఉండాలని రూలేం లేదు. ఈ విషయంలో ముందు మీ మైండ్‌ సెట్‌ మారాలి. తగ్గాల్సింది నేను కాదు’’ అని ఘాటుగా స్పందించడం చర్చనీయాంశమైంది.