విజయ్‌ ఆంటోని ‘ఇంద్రసేన’ ట్రైలర్‌ రిలీజ్‌ !

విజయ్‌ ఆంటోని ‘ఇంద్రసేన’ చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆర్‌. స్టూడియోస్‌, విజయ్‌ ఆంటోని ఫిల్మ్‌ కార్పోరేషన్‌ పతాకంపై జి.శ్రీనివాసన్‌ దర్శకత్వంలో రాధికా శరత్‌కుమార్‌, ఫాతిమా విజయ్‌ ఆంటోని సంయుక్తంగా నిర్మించిన ‘అన్నాదురై’ చిత్రాన్ని తెలుగులో ‘ఇంద్రసేన’ పేరుతో రిలీజ్‌ చేస్తున్నారు. ఈ చిత్రం లోగోని మెగాస్టార్‌ చిరంజీవి రిలీజ్‌ చేశారు. డయానా చంపిక, మహిమా హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రానికి విజయ్‌ ఆంటోని సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ట్రైలర్‌ రిలీజ్‌ని అక్టోబర్‌ 12న హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో రిలీజ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో విజయ్‌ ఆంటోని, హీరోయిన్స్‌ డయానా చంపిక, మహిమా, దర్శకుడు జి.శ్రీనివాసన్‌ రచయిత భాషా శ్రీ పాల్గొన్నారు. అనంతరం సీనియర్‌ జర్నలిస్ట్‌ పసుపులేటి రామారావు ‘ఇంద్రసేన’ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు.

సీనియర్‌ జర్నలిస్ట్‌ పసుపులేటి రామారావు మాట్లాడుతూ – ”బిచ్చగాడు’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విజయ్‌ ఆంటోని మరోసారి ‘ఇంద్రసేన’తో వస్తున్నారు. ట్రైలర్‌ చాలా బాగుంది. రాధికా శరత్‌కుమార్‌లు ఈ సినిమాని రిలీజ్‌ చేయడం అంటే సినిమా ఎంత గొప్పగా వచ్చిందో అర్థం అవుతుంది. ‘ఇంద్రసేన’ ‘బిచ్చగాడు’ కంటే పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

హీరో విజయ్‌ ఆంటోని మాట్లాడుతూ – ”బిచ్చగాడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులందరూ నన్ను హీరోగా యాక్సెప్ట్‌ చేసి నా సినిమాలు అన్నింటినీ ఆదరిస్తున్నారు. చాలా సంతోషంగా వుంది. శ్రీనివాసన్‌ ఫస్ట్‌టైమ్‌ డైరెక్షన్‌ చేశాడు. సినిమా చాలా బాగా వచ్చింది. సెంటిమెంట్‌, ఎమోషన్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌తో ఈ సినిమాని రూపొందించాం. భాషా శ్రీ అద్భుతమైన డైలాగులు, పాటలు రాశారు. నా ఫస్ట్‌ సినిమా ‘బిచ్చగాడు’ నుండి నాతో ట్రావెల్‌ అవుతున్నాడు. వెరీ వెరీ సిన్సియర్‌ హార్డ్‌ వర్కర్‌. నమ్మితే ప్రాణం పెట్టి పని చేస్తాడు. నెక్స్‌ట్‌ తెలుగులో డైరెక్ట్‌ ఫిలిం చెయ్యబోతున్నాం. ఆ సినిమాకి కూడా భాషా శ్రీ వర్క్‌ చేస్తున్నాడు. హీరోయిన్స్‌ డయానీ, మహిమ ఇద్దరూ క్యారెక్టర్స్‌లో ఇన్‌వాల్వ్‌ అయి నటించారు. ప్రస్తుతం సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ఫైనల్‌ స్టేజ్‌లో వుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాని డిసెంబర్‌ 1న రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నాం” అన్నారు.

దర్శకుడు జి.శ్రీనివాసన్‌ మాట్లాడుతూ – ”ఇది నా మొదటి సినిమా. ‘ఇంద్రసేన’ లోగోని మెగాస్టార్‌ చిరంజీవిగారు రిలీజ్‌ చేయడం చాలా హ్యాపీగా వుంది. చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ‘బిచ్చగాడు’ ఎమోషనల్‌ డ్రామా, సెంటిమెంట్‌తో విజయ్‌ ఆంటోని ఆకట్టుకున్నాడు. ‘ఇంద్రసేన’తో పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌లో కన్పించబోతున్నారు. ఈ చిత్రంలో సెంటిమెంట్‌, ఎమోషన్‌, యాక్షన్‌ అన్నీ వున్నాయి. డెఫినెట్‌గా ఈ చిత్రం మంచి హిట్‌ అవుతుందని నమ్ముతున్నాను” అన్నారు.

రచయిత భాషా శ్రీ మాట్లాడుతూ – ”బిచ్చగాడు’, ‘భేతాళుడు’, యెమన్‌’ వరుసగా విజయ్‌ ఆంటోనిగారు సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ‘ఇంద్రసేన’తో పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌లో కన్పించబోతున్నారు. ఇదొక డిఫరెంట్‌ సబ్జెక్ట్‌. లాస్ట్‌ మూడు చిత్రాల కంటే ఈ సినిమా అంతకు మించి వుంటుంది. లాస్ట్‌ 15 నిమిషాలు ఎవరూ ఎక్స్‌పెక్ట్‌ చేయనివిధంగా వుంటుంది. డైరెక్టర్‌ శ్రీనివాసన్‌ సూపర్‌ క్లైమాక్స్‌ చేశారు. ఫస్ట్‌ ఫిలిం డైరెక్టర్‌లా కాకుండా ఎక్స్‌పీరియన్స్‌ వున్న డైరెక్టర్‌లా చేశాడు. ఈ చిత్రానికి మాటలు, పాటలు రాశాను. విజయ్‌ ఆంటోనిగారు అన్ని సినిమాలకు రాసే అవకాశం ఇస్తూ నన్ను ఎంకరేజ్‌ చేస్తున్నందుకు ఆయనకి, ఫాతిమాగారికి నా థాంక్స్‌” అన్నారు.

హీరోయిన్‌ మహిమ మాట్లాడుతూ – ”ఇంతకు ముందు ‘రెండు రెళ్లు ఆరు’ చిత్రంలో హీరోయిన్‌గా యాక్ట్‌ చేశాను. ఇది నా సెకండ్‌ ఫిల్మ్‌. ఈ చిత్రంలో ఒక ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌లో నటించాను. సింపుల్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తూ వితౌట్‌ మేకప్‌లో నటించాను. డైరెక్టర్‌ శ్రీనివాస్‌ ప్రతి సీన్‌ ఎక్స్‌ప్లెయిన్‌ చేస్తూ చాలా నేచురల్‌గా యాక్ట్‌ చేయించారు. తమిళంలో ‘అన్నాదురై’ ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది. చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తెలుగు ట్రైలర్‌ కూడా అందరికీ నచ్చుతుంది. రాధికా శరత్‌కుమార్‌, విజయ్‌ ఆంటోనిగారి బేనర్‌లో ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా వుంది. తెలుగు అమ్మాయిని అయిన నన్ను విజయ్‌ ఆంటోనిగారు ఎంతో సపోర్ట్‌ చేసినందుకు థాంక్స్‌” అన్నారు.

హీరోయిన్‌ డయానా చంపిక మాట్లాడుతూ – ”ట్రైలర్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సినిమా కూడా ప్రేక్షకులందరూ ఎంజాయ్‌ చేసేవిధంగా వుంటుంది. విజయ్‌ ఆంటోని, ఫాతిమా, డైరెక్టర్‌ శ్రీను మా టీమ్‌ అందరికీ థాంక్స్‌” అన్నారు.

విజయ్‌ ఆంటోని, డయానా చంపిక, మహిమ, జువెల్‌ మేరీ, రాధా రవి, కాళి వెంకట్‌, నళిని కాంత్‌, రింధు రవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ధిల్‌రాజ్‌, సంగీతం అండ్‌ ఎడిటింగ్‌: విజయ్‌ ఆంటోని, ఆర్ట్‌: అనంత్‌మణి, స్టంట్‌: రాజశేఖర్‌, కొరియోగ్రఫీ: కళ్యాణ్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: కవిత అండ్‌ కె.సరంగన్‌, డైలాగ్స్‌ అండ్‌ లిరిక్స్‌: భాషా శ్రీ, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: ఆర్‌. జనార్థన్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: సంద్రజాన్సన్‌, నిర్మాతలు: రాధికా శరత్‌కుమార్‌, ఫాతిమా విజయ్‌ ఆంటోని, దర్శకత్వం: జి.శ్రీనివాసన్‌.

Vijay Antony ‘Indra Sena’ Trailer Launched 
 “Indra Sena” is an upcoming film of Vijay Antony, who made his mark in Tollywood by scoring commercial hits with different and unique subjects. Radhika Sarathkumar and Fathima Vijay Antony are jointly producing the movie under R Studios and Vijay Antony Film Corporation Banners, while G Srinivasan is the director. Indra Sena trailer launch press meet has been held in Prasad Labs. Senior journalist Pasupuleti Rama Rao has launched the trailer.
While speaking on the occasion, Pasupuleti Rama Rao said, “Vijay Antony has become very close to Telugu spectators with Bichagadu. After watching the trailer, I came to know that this movie is going to be another hit in his account. The content appears interesting.”
Heroines Mahima, Diana said, “Trailer has been getting immense response. Vijay Antony and Srinivasan have supported to the core.”
Bashya Sri said, “Bichagadu was a super hit. The films came after were very different to each other. Indra Sena is going to become much bigger hit than Bichagadu. Vijay Antony’s performance and director’s taking skills will be major highlights.”
Director Srinivasan said, “Chiranjeevi gaaru introduced powerful role like Indra Sena, wherein Vijay Antony introduced emotional character like Bichagadu to Telugu audiences. Indra Sena will have these two characters.”
Vijay Antony said, “Indra Sena is an emotional drama. It will definitely enthrall one and all. I must thank writer Bashya Sri and and director Srinivasan. Bashya Sri played key role in my successful career. We will release Indra Sena in December.”
Vijay Antony, Diana Champika, Mahima, Jewel Mary, Radha Ravi, Kali Venkat, Nalini Kanth and Rindu Ravi are the prime cast in the film that is written by Bashya Sri, choreography is by Kalyan, stunts by Rajasekhar, art by Anand Mani, editing and music are by Vijay Antony, Cinematography is by K Dil Raju,. Sandra Johnson is line producer of the film produced jointly by Radhika Sarathkumar and Fathima Vijay Antony. G Srinivasan is the director.