విజ‌య్ చంద‌ర్ `సాయి నీ లీల‌లు` పాట‌ల‌ రికార్డింగ్

‘క‌రుణామ‌యుడి’గా, ‘వేమ‌న‌’గా, ‘ఆంధ్రకేస‌రి’గా తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో నిలిచిపోయిన ‘న‌ట పిపాసి’ విజ‌య్ చంద‌ర్. తాజాగా ఆయ‌న  అఖిలాండ కోటి బ్ర‌హ్మాండ నాయ‌కుడు, స‌చ్చిదానంద స‌మ‌ర్ధ స‌ద్గురువుగా భ‌క్తుల‌చే కీర్తించ‌బ‌డే శ్రీ షిరిడి సాయినాధుని క‌థ‌ను `సాయి నీ లీల‌లు` టైటిల్ తో తెర‌కెక్కుతోన్న చిత్రంలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ చంద‌ర్ ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో  స‌జ్జ‌ల  శ్రీనివాస్ నిర్మాణ సార‌థ్యంలో ఈ చిత్రం  రూపుదిద్దుకుంటోంది.
కాగా ఈ సినిమా పాట‌ల‌ రికార్డింగ్ ప‌నులు పూజా కార్య‌క్ర‌మాల‌తో  ఈరోజు ఉద‌యం  ప్ర‌సాద్ ల్యాబ్స్ అధినేత ర‌మేష్ ప్ర‌సాద్ చేతుల మీదుగా ప్రారంభం అయ్యాయి.  అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ… `  విజయ్ చందర్ గారు గతంలో ఎన్నో భక్తి రస చిత్రాలు చేశారు. అవ‌న్ని తెలుగు ఆడియోన్స్ ను ఎంతగానో అలరించాయి. మరో సారి సాయి నాథుని రూపంలో వస్తున్నారు. సినిమా చక్కని విజయం సాధిస్తుoది` అని అన్నారు.
న‌టుడు విజ‌య్ చంద‌ర్ మాట్లాడుతూ…` 30 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ బాబా ఆశీస్సుల‌ల‌తో ఆయ‌న సినిమా చేస్తున్నా. న‌టీన‌టుల ఎంపిక మొత్తం  పూర్త‌యింది. ఈనెలంతా పాట‌ల రికార్డింగ్ ప‌నులు జ‌రుగుతాయి. న‌వంబ‌ర్ నెల‌ఖారుక‌ల్లా సినిమా సెట్స్ కు వెళ్తుంది.గ్రాఫిక్స్ వ‌ర్క్ ఎక్కువ‌గా ఉంది. సినిమాకు అవి హైలైట్ గా ఉంటాయి. ‘క‌రుణామ‌యుడు’ సినిమా కోసం నేను ఎంత క‌ష్ట‌ప‌డ్డానో ఈ సినిమా కోసం అంతే క‌ష్టం ఉంటుంది. అన్ని ప‌నులు పూర్తి చేసి మార్చి నెల లోపు సినిమా విడుద‌ల చేస్తాం` అని అన్నారు.
కాజా సూర్య నారాయ‌ణ మాట్లాడూతూ…`  సాయి బాబా పాత్ర వేస్తే విజ‌య్ చంద‌ర్ గారే వేయాలి. ఆయ‌న ఆహార్యం…న‌ట‌న ఎంత బాగుంటాయో గ‌త సినిమాలు చూస్తే తెలుస్తుంది. వెంక‌టేశ్వ‌ర స్వామి త‌ర్వాత ప్ర‌తీ ఒక్క‌రూ పూజించే దేవుడు సాయిబాబు. ఈ సినిమా పెద్ద విజ‌యం సాధిస్తుంది` అని అన్నారు.
అనంత శ్రీరాం మాట్లాడుతూ…` పాట‌లు, సంగీతం ఒక రే చేస్తే బాగుంటుంద‌ని విజ‌య్ చంద‌ర్ గారు  సూచించ‌డంతో నేను సంగీతం చేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ఈ అవ‌కాశం ఇచ్చిన విజ‌య్ చంద‌ర్ గారికి ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు అని అన్నారు.
అనంత శ్రీరామ్ తండ్రి వీర వెంక‌ట స‌త్య‌న్నారాయ‌ణ మూర్తి మాట్లాడుతూ…`  సాయిబాబా గా విజ‌య్ చంద‌ర్ గారు మాత్ర‌మే న‌టించ‌గ‌ల‌ర‌ని ఇప్ప‌టికే నిరూపించుకున్నారు. మ‌ళ్లీ సాయిలీల‌లు టైటిల్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ నా కుమారుడు అనంత శ్రీరాం పాట‌ల ర‌చయిత‌గానే అల‌రించాడు. ఈ సినిమాతో సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. సినిమా చ‌క్క‌ని విజ‌యం సాధించాలి` అని అన్నారు.
మాట‌ల ర‌చ‌యిత తోట‌ప‌ల్లి మధు మాట్లాడుతూ…` 1985 లో  శ్రీ షిరిడి సాయి బాబా మ హ‌త్యానికి మాట‌లు రాశాను. మ‌ళ్లీ 30 ఏళ్ల త‌ర్వాత సాయిబాబా సినిమాకు ప‌నిచేయ‌డం చాలా సంతోషంగా ఉంది. విజ‌య్ చంద‌ర్ గారిని ఒప్పించ‌డం అంటే చిన్న విష‌యం కాదు. చాలా క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది. ఇంట‌ర్వెల్…క్ల‌యిమాక్స్ సీన్లు,  డైలాగ్ లు హైలైట్ గా ఉంటాయి` అని అన్నారు.