పాతికమంది అతనితో చెయ్య’నో’ అన్నారట !

‘అర్జున్ రెడ్డి’ సినిమా కంటే ముందు విజయ్‌తో సినిమా అంటే దాదాపు పాతిక మంది హీరోయిన్లు ‘నో’ చెప్పేశారట.ఒక హీరోకు  ఇండస్ట్రీలో సక్సెస్ రానంతవరకూ …అతనితో సినిమా చేయాలంటే అంతా సంకోచిస్తారు. అతను ఒక్కసారి సక్సెస్ అయ్యాడంటే చాలు… సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలతో పాటు హీరోయిన్లు సైతం పోటీపడతారు. విజయ్ దేవరకొండ విషయంలో కూడా అదే జరిగిందట. ‘అర్జున్ రెడ్డి’ సినిమా కంటే ముందు ‘విజయ్‌తో సినిమా’ అంటే దాదాపు 25 మంది హీరోయిన్లు ‘నో’ చెప్పేశారట.
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన విజయ్ దేవరకొండకు ప్రస్తుతం ఉన్న ఇమేజ్,క్రేజ్ వేరు. విజయ్ దేవరకొండ సినిమా అంటే చాలు …యూత్ అంతా థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. అయితే తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ‘గీత గోవిందం’ సినిమా కూడా విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకుంది.
నిజానికి ‘అర్జున్ రెడ్డి’ సినిమా కంటే ముందే తాను ‘గీత గోవిందం’ సినిమా చేయడానికి సన్నాహాలు చేశానని, అయితే ఆ సమయంలో హీరో విజయ్ దేవరకొండకు అంతగా గుర్తింపు లేకపోవడంతో అతనితో జోడీ కట్టేందుకు హీరోయిన్స్ ఆసక్తి చూపలేదని ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్ అన్నారు. అలా దాదాపుగా 25 మంది హీరోయిన్లు సినిమాను రిజెక్ట్ చేశారని చెప్పాడు. చివరకు రష్మిక మందన్న ఒప్పుకొని గీత పాత్రలో అద్భుతమైన నటన కనబర్చిందని … ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
ఉదార హృదయం
మొదటి అవార్డును ఎంతో అపురూపంగా చూసుకుంటారు సినీ నటులు. కానీ విజయ్‌ దేవరకొండ మాత్రం అందుకు భిన్నం. ‘అర్జున్‌ రెడ్డి’ నటనకు గానూ విజయ్‌కు వచ్చిన ‘ఫిలింఫేర్‌’ అవార్డ్‌ను వేలం వేయగా వచ్చిన 25లక్షలను సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే.
 
గత కొన్ని రోజులుగా వరదలతో కేరళ అతలాకుతలమైపోతోంది. పలు జిల్లాలు నీట మునిగాయి. కేరళ వరద బాధితులకు విరాళాలను సేకరిస్తోంది అక్కడి ప్రభుత్వం. ఇప్పటికే చిత్ర పరిశ్రమ నుంచి విశాల్‌, సూర్య, కార్తీ, కమల్ హసన్, అల్లు అర్జున్ తమ వంతు సహాయాన్ని అందించారు. మరి కొంతమంది ప్రముఖులు కూడా ముందుకు వస్తున్నారు. విజయ్‌ దేవరకొండ తన వంతు సహాయంగా ఐదు లక్షల రూపాయల్ని విరాళంగా ఇచ్చారు. సహాయమందించాలని విజయ్‌ తన అభిమానులను కోరారు.