అతని దర్శకత్వంలోనే బాలీవుడ్‌లో సినిమా !

విజయ్‌ దేవరకొండ … బాలీవుడ్‌లో ఆఫ్‌బీట్‌ డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్న వాసన్‌ బాల దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాడని తెలిసింది. తెలుగు చిత్రసీమలో  ఫుల్‌ క్రేజ్‌ సంపాదించుకున్న హీరో విజయ్‌ దేవరకొండ… ఒక పక్క తెలుగులో సినిమాలు చేస్తూనే మరో పక్క బాలీవుడ్‌లో అడుగుపెట్టాలని భావిస్తున్నాడట. బాలీవుడ్‌లో ఆఫ్‌బీట్‌ డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్న వాసన్‌ బాల దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాడని తెలిసింది. బాల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ది మ్యాన్‌ హు ఫీల్స్‌ నో పెయిన్‌’ చిత్రం ట్రైలర్‌ చూసి అతని దర్శకత్వంలో పని చేయాలని తపన పడుతున్నాట. ఈ తరుణంలోనే ఈ ట్రైలర్‌ను విజయ్… ఈ హీరో సినిమాల ఎంపికను బాల ఒకరిని ఒకరు ప్రశంసించుకోవడం జరిగిపోయింది. అప్పుడే ‘ఏదైనా మంచి స్క్రిప్ట్‌ ఉంటే చెప్పండి .మన కాంబినేషన్‌లో ఓ సినిమా చేద్దాం’ అని విజయ్ అతనితో చెప్పేసాడు.
కాకినాడ‌ ఫ్యాన్స్‌తో క‌లిసి ‘హరితహారం’
‘గీతా గోవిందం’ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన ‘రౌడీ’ విజయ్‌ దేవరకొండ ప్ర‌స్తుతం ‘డియ‌ర్ కామ్రేడ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో విజ‌య్ కాకినాడ యాస‌లో మాట్లాడి అల‌రించ‌నున్నాడు విజ‌య్‌. భరత్ కమ్మ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రి మూవీ మేక‌ర్స్ బ్యానర్ లో  ఈమూవీ రూపొందుతోంది. అయితే రాష్ట్రాన్ని ప‌చ్చ‌ద‌నంతో నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హరితహారం’  కార్యక్రమంలో భాగంగా ప్రముఖులు ‘గ్రీన్ ఛాలెంజ్’ పేరుతో మొక్క‌లు నాటి …మిగ‌తా సెల‌బ్రిటీల‌కి ఆ ఛాలెంజ్ విసురుతున్నారు. ఈ క్ర‌మంలో శ్రీకాంత్ కిదాంబి,బొంతు రామ్మోహ‌న్… యువ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి ఛాలెంజ్ విసిరారు. ఆ ఛాలెంజ్‌ని తాజాగా స్వీక‌రించిన విజ‌య్ దేవ‌ర‌కొండ కాకినాడ‌లో త‌న ఫ్యాన్స్‌తో క‌లిసి మొక్క‌లు నాటాడు. అంతేకాదు కాకినాడ బాయ్స్‌తో క‌లిసి లంచ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోని ట్విట్ట‌ర్‌లో షేర్ చేశాడు విజ‌య్. ‘డియ‌ర్ కామ్రేడ్’ ప్ర‌స్తుతం కాకినాడ‌లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుండగా, చిత్రంలో స్టూడెంట్ లీడర్ గా విజయ్ దేవరకొండ క‌నిపించ‌నున్నాడు . క్రికెటర్ గా రష్మిక మందన కనిపించనుంది.