అవి…ఇవీ వద్దనుకున్నాడట !

“పెళ్లిచూపులు” , “అర్జున్ రెడ్డి” చిత్రాలతో సంచలన విజయాలు అందుకున్న విజయ్ దేవరకొండ మంచి ఊపు మీదున్నాడు. ముఖ్యంగా అర్జున్ రెడ్డి సంచలన విజయం సాధించడంతో విజయ్ దేవరకొండ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. దీంతో అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. పెద్ద ఎత్తున అవకాశాలు వస్తుండటంతో విజయ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.

 ఇటీవల బాలీవుడ్ లో దిగ్గజ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ విజయ్ దేవరకొండ తో సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చారు, అయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు. అది కూడా వరుసగా ….. పైగా అదే సమయంలో వేరే సినిమాలు చేయొద్దని కండీషన్ కూడా ఉంది.  దాంతో యశ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్ళ ఆఫర్ ని తిరస్కరించాడు విజయ్ దేవరకొండ . విజయ్ యశ్ రాజ్ ఫిలిమ్స్ చిత్రాలను రిజెక్ట్ చేయడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే యశ్ రాజ్ చిత్రాలను చేయడం వల్ల ఈ హీరో ఇమేజ్ దేశ వ్యాప్తం అవుతుంది. కానీ అదే సమయంలో తెలుగులో చేసే అవకాశం ఉండదు. అందుకే ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసాడట విజయ్ దేవరకొండ 

ముద్దులు , హగ్గులు ఏమి లేవు !

“అర్జున్ రెడ్డి” చిత్రంలో హీరోయిన్ తో ఘాటు రొమాన్స్ చేస్తూ ముద్దుల మీద ముద్దులు ఇచ్చి సంచలనం సృష్టించాడు హీరో విజయ్ దేవరకొండ కానీ తాజాగా ఓ చిత్రంలో నటించడానికి అంగీకరించిన ఈ హీరో…. ఆ చిత్రంలో చాలా పద్దతిగా కనిపిస్తానని , ముద్దులు , హగ్గులు లాంటివి ఏమి లేవని అంటున్నాడు. అంతేనా …… ఈ సినిమా తర్వాత ఓ మూడు సినిమాల వరకు పద్దతిగా కనిపిస్తానని అంటున్నాడు . అంటే కావలసినంత ముద్దులు ఒక్క “అర్జున్ రెడ్డి” చిత్రంలోనే తీసుకున్నాడు కాబట్టి, వాటికీ కొంత గ్యాప్ ఇస్తున్నాడన్న మాట . “అర్జున్ రెడ్డి” చిత్రం హిట్ కంటే వివాదాస్పదం ఎక్కువయ్యింది. దాంతో తాజాగా నటించబోయే చిత్రాల్లో హీరోయిన్ కు కనీసం ముద్దు కూడా పెట్టనని , ఫ్యామిలీ చిత్రాలను కోరుకునే వాళ్ళ కోసం సినిమా చేస్తున్నానని అంటున్నాడు ఈ హీరో .