విజయ్ దేవరకొండ ….నిజ జీవితంలోనూ బోల్డ్‌గా ఉంటూ యూత్ ఐకాన్‌గా మారిపోయాడు. విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. యూత్‌లో తనకున్న ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని వారి కోసం సొంత దుస్తుల బ్రాండ్‌ను విజయ్ ప్రారంభించబోతున్నాడు.
‘ట్విటర్’ ద్వారా ఈ విషయాన్ని విజయ్ వెల్లడించాడు. `రౌడీ క్లబ్` పేరుతో ఈ బ్రాండ్‌ను మార్కెట్‌లోకి తీసుకురాబోతున్నాడు. “బస్టాప్ వద్ద ఎదురుచూస్తున్నాను. ఇప్పటికీ నాకు నచ్చిన షర్టు దొరకలేదు. నేను కూడా మీలాగే రౌడీని”అని విజయ్ ట్వీట్ చేశాడు. ఈ `రౌడీ క్లబ్`లో చేరాలనుకుంటున్నవారు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని సూచించాడు. ఈ బ్రాండ్ లాంఛింగ్ సందర్భంగా ఈ నెల 15న తేదీన పార్టీ ఇవ్వబోతున్నట్టు తెలిపాడు.
‘సెన్సేషన్ స్టార్’ ముఖ్యమంత్రిగా నటిస్తే …
‘పెళ్లిచూపులు’,‘అర్జున్‌రెడ్డి’సినిమాలతో ‘సెన్సేషన్ స్టార్’గా పేరు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు యూత్‌లో ఈ హీరోకున్న క్రేజ్ మరే హీరోకు లేదనే చెప్పాలి. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉన్నాడు విజయ్. వీటిలో ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ హీరో చేస్తున్న మరో సినిమా ‘నోటా’.
ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. ‘నోటా’ సినిమా రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిందనే విషయం తెలిసిందే. అయితే విజయ్ దేవరకొండ పాత్ర ఎలా ఉంటుందనేది సస్పెన్స్. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రిగా కనిపించనున్నారని సమాచారం. సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటిస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. మరి సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రిగా నటిస్తే ….వేచి చూద్దాం.