ఈ క్రేజీ హీరో డిమాండ్ ఇలా ఉందట !

విజయ్ దేవరకొండ… సినిమావాళ్లకు హిట్ రాగానే లెక్కలు మారిపోతాయి. అలాంటిది వరస పెట్టి హిట్స్ వస్తే ఇంక చెప్పేదేముంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ పరిస్దితి అలాగే ఉంది.
2018లో విజయ్ దేవరకొండ నటించిన ‘గీతా గోవిందం’,’టాక్సీవాలా’,’మహానటి’ సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. ‘నోటా’ ప్లాఫ్ అయినా మంచి ఓపినింగ్స్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో యూత్ లో విజయ్ దేవరకొండ క్రేజ్ బాగా పెరిగింది. అందుకు త‌గ్గ‌ట్టుగానే త‌న రెమ్యునరేషన్ భారీగా పెంచి డిమాండ్ చేస్తున్నాడు
విజ‌య్ దేవ‌ర కొండ త‌న మొదటి సినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లో నటించినందుకు కేవలం ఆరు లక్షల రూపాయలు మాత్రమే రెమ్యునేషన్ గా అందుకున్నాడు. ఆ తర్వాత నటించిన ‘పెళ్లి చూపులు’కు కూడా విజయ్‌ రెమ్యునరేషన్‌ ఆరు లక్షలేనట. ఆ తర్వాత వచ్చిన ‘ద్వారక’, ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాలకు రూ. 20 లక్షలు తీసుకున్నాడట.యువీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో విజయ్‌ చేసిన హారర్‌ కామెడీ ‘టాక్సీవాలా’ కోసం రూ. 80 లక్షలు అందుకుంటున్నాడట. తాజాగా క్రాంతి మాధవ్ డైరక్షన్ లో సినిమా కోసం ఏడున్నర కోట్లు రెమ్యునేషన్ తీసుకుంటున్నాడని సమాచారం.
ఇలా తన భాక్సాపీస్ క్రేజ్ ని బట్టి రెమ్యునరేషన్ పెంచుకుంటూ వస్తున్న విజయ్ దేవరకొండ ఇకపై అంగీకరించే ప్రాజెక్టులకు మాత్రం 9 కోట్లు అడగాలని డిసైడ్‌ అయ్యాడట.
ఈ రెమ్యునరేషన్ ఎక్కువా? అంటే…”ఓ ఆర్టిస్ట్‌కు ఉన్న మార్కెట్‌ను బట్టే రెమ్యునరేషన్‌ ఇస్తారని, ఎంత అడిగితే అంత ఎవరూ ఇవ్వరని” అంటున్నాడు విజయ్‌ దేవరకొండ ధీమాగా.
‘ప్లేబాయ్‌’ తరహా పాత్రలో…
సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ ఇప్పుడు టాలీవుడ్లో హాట్‌ ఫేవరెట్‌గా మారిపోయాడు. ఇప్పటికే కోలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చిన ఈ యంగ్ హీరో టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల ‘గీత గోవిందం’లో మరో ఘనవిజయాన్ని అందుకున్న విజయ్‌ ప్రస్తుతం ‘డియర్‌ కామ్రేడ్‌’లో… ఈ సినిమా తరువాత ‘మళ్లీ మళ్లీ ఇది రాని’ రోజు ఫేం క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ఓ సినిమా నటిస్తున్నాడు.
ఈ సినిమాలో విజయ్‌ మరో డిఫరెంట్‌ రోల్‌లో కనిపించనున్నాడు అనే టాక్‌ వినిపిస్తోంది. రాశీఖన్నా, కేథరిన్‌ థ్రెస్సా, ఐశ్వర్య రాజేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ‘ప్లేబాయ్‌’ తరహా పాత్రలో కనిపించనున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది.
దీని తర్వాత మరో సినిమాకు కూడా విజయ్ కమిట్ అయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే నిర్మిస్తోందని సమాచారం. ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ దర్శకుడు  వెంకీ అట్లూరి దర్శకత్వం లో  ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.