‘హిట్’లర్ విజయ్ పది కోట్లకు పెరిగాడు !

విజయ్ దేవరకొండ మన యువ హీరోల్లో టాప్. ‘పెళ్లి చూపులు’తో మొదలుపెట్టి ‘అర్జున్ రెడ్డి’, ‘గీతా గోవిందం’, ‘టాక్సీవాలా’ ఇలా వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న విజయ్ కి డిమాండ్ బాగా పెరిగింది. ఇక ‘రౌడీ’ బ్రాండ్‌తో ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టి అక్కడా దూసుకుపోతున్నాడు. తన పేరునే యూత్ బ్రాండ్‌గా మార్చేసుకున్న విజయ్ అమ్మాయిలకు కలల రాకుమారుడుగా మారిపోయాడు. విజయ్ కెరీర్ మొదట్లో అతనితో సినిమాలు చేసేందుకు ఇష్టపడని హీరోయిన్లు సైతం ఇప్పుడు అతని వెంట పడుతున్నారు. దీంతో విజయ్ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు చాలామంది నిర్మాతలు ఇతనితో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.నిర్మాతలు అతనితో సినిమాలు తీసేందుకు పోటీ పడుతున్నారు. ఇక ఇతని మార్కెట్ స్థాయి కూడా భారీగా పెరిగింది. ‘గీతా గోవిందం’తో 100 కోట్లకు మార్కెట్ సంపాయించుకున్నాడు. అందుకే రెమ్యునరేషన్ కూడా బాగా పెంచాడట.
 
వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ ఎంత అడిగితే అంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు పోటీపడుతున్నారు. ఇప్పటివరకు ఆయన సినిమాకు రూ.4కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే విజయ్‌కున్న క్రేజ్‌కు రూ.10కోట్లు కూడా తక్కువేనని పరిశ్రమలోని వారు ఫీలవుతున్నాడట. ఇక టాలీవుడ్‌లో స్టార్ ప్రొడ్యూసర్‌గా ఉన్న దిల్ రాజు కూడా విజయ్ దేవరకొండతో సినిమా చేసేందుకు ముందుకొచ్చారట. విజయ్‌తో తన బ్యానర్‌లో సినిమా చేయాలని చెప్పారట.. అయితే విజయ్ అడిగిన రెమ్యునరేషన్ చూసి దిల్ రాజు షాక్ అయ్యారని ఫిల్మ్ వర్గాల సమాచారం. ఇంతకీ విజయ్ ఎంత రెమ్యునరేషన్ అడిగాడో తెలుసా? అక్షరాలా రూ.10కోట్లు.సినీ వర్గాల సంచారం మేరకు విజయ్ ప్ర‌స్తుతం ఒక్క సినిమాకు 10 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నాడని టాక్. ఇంత హెవీ రెమ్యునరేషన్ అయినప్పటికీ ఇతనికి చేతి నిండా సినిమాలుండటం విశేషం.
 
ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మరో రెండు ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత విజయ్ దేవరకొండతో సినిమాలు చేయడానికి పెద్ద నిర్మాతలు ఆసక్తిని చూపుతున్నారు. విజయ్ దేవరకొండకి గల క్రేజ్‌ను, మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని అతడి వెంటపడుతున్నారు.
 
ఆ సినిమా త‌ర్వాత క్లారిటీ వ‌స్తుంది !
 
ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కున్న మంచి డిమాండ్ దృష్ట్యా అతనితో సినిమా చేసేందుకు చాలా మంది డైరెక్ట‌ర్లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇటీవ‌ల `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో విజయం అందుకున్న పూరీ జ‌గ‌న్నాథ్‌తో, స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివతో విజ‌య్ సినిమాలు చేయ‌బోతున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ రెండు సినిమాల‌పై విజ‌య్ స్పందించాడు…
`పూరీ జ‌గ‌న్నాథ్‌గారితో సినిమా గురించి ఏమీ అనుకోలేదు. ఆ ఆలోచ‌న కూడా రాలేదు. ఇక‌, డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌గారితో సినిమా చేయాల‌ని నాకు ఉంది. ఆయ‌న ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవిగారితో ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్త‌య్యాక ఇద్ద‌రికీ వీలు కుదిరితే అప్పుడు ఆలోచిస్తామ‌`ని విజ‌య్ చెప్పాడు.