విజ‌య్ దేవ‌ర‌కొండ‌ సినిమా `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌`

కె.ఎస్‌.రామారావు స‌మర్ప‌ణ‌లో క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాన‌ర్‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో కె.ఎ.వ‌ల్ల‌భ నిర్మిస్తోన్న చిత్రానికి `వ‌ర‌ల్డ్ ఫేమస్ ల‌వ‌ర్‌` అనే పేరు పెట్టారు. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ తో రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేశ్‌, క్యాథ‌రిన్ ట్రెసా, ఇజాబెల్లా లెయితే హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.
దర్శకుడు క్రాంతి మాధ‌వ్ సున్నితమైన క‌థాంశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కిస్తున్నారు, ఈ పేరు ఎందుకు పెట్టామో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..అని చిత్ర యూనిట్ చెబుతుంది. సెప్టెంబ‌ర్ 20 సా; 5 గంకు ఫ‌స్ట్‌లుక్‌ విడుద‌ల చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా హైద‌రాబాద్‌లో చిత్రీక‌ర‌ణ‌ జ‌రుపుకుంటోంది. జాతీయ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీసుంద‌ర్ సంగీతం, జ‌య‌కృష్ణ గుమ్మ‌డి సినిమాటోగ్రఫీ ..అందిస్తున్నారు.