వసూళ్ళలో 250 కోట్లు దాటేస్తుందట !

విజయ్ త్రిపాత్రాభినయంతో ఇటీవలే కోలీవుడ్ ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘మెర్సల్’ కోలీవుడ్‌లో సంచలన విజయం దిశగా దూసుకుపోతుంది . ‘ఇళయ దళపతి’ విజయ్‌కి మెమరబుల్ ఫిల్మ్‌గా మిగలబోతోంది. ఇక ఈచిత్రంలో నిత్యమీనన్, సమంత, కాజల్ కథానాయికలుగా నటించారు. వీరిలో నిత్యమీనన్ విజయ్‌తో మొదటిసారి నటించగా కాజల్-సమంత ఇద్దరికీ ఇళయదళపతితో ఇది మూడో సినిమా. విజయ్-కాజల్ కలయికలో అంతకుముందు ‘తుపాకి’, ‘జిల్లా’ చిత్రాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఇక విజయ్-సమంత కాంబినేషన్‌లో గతంలో ‘కత్తి’, ‘తెరి’ చిత్రాలొచ్చాయి. ఈ సినిమాలు రెండు కూడా ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇలా కాజల్-సమంత ఇద్దరితోనూ ‘మెర్సల్’ విజయంతో హ్యాట్రిక్స్ కొట్టేశాడన్నమాట విజయ్.
 సినిమాలో ఉన్న కంటెంట్ విషయంలో రాజకీయంగా పలు విమర్శలు వచ్చినా అదంతా ‘మెర్సల్’‌కు మంచి పబ్లిసిటీనీ అందించింది. గడిచిన వారం రోజుల్లోనే ఈ చిత్రం రూ.180 కోట్ల వసూళ్లను కొల్లగొట్టిందట. ఇక ఈ చిత్రం ఫుల్ రన్‌లో రూ.250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్ ఎక్స్ పర్ట్స్. మరోవైపు ‘మెర్సల్’ తెలుగు వెర్షన్ ‘అదిరింది’ శుక్రవారం విడుదలవ్వాల్సి ఉన్నా… సెన్సార్ కారణాల వల్ల ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. త్వరలోనే ‘అదిరింది’ న్యూ రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారట.