కొత్తదనంతో సంచలనం : ప్ర‌శంస‌ల వ‌ర్షం !

ప్ర‌స్తుతం అమెరికా నుండి హైదరాబాద్ వ‌ర‌కు యూత్ ను ఊపేస్తున్న ఒకే ఒక్క టాపిక్ ‘అర్జున్ రెడ్డి’ చిత్రం. ఆగ‌స్ట్ 25న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సెన్సేషన్ క్రియేట్ చేసింది. విజయ్ దేవరకొండ, షాలిని పాండే, రాహుల్ రామకృష్ణ, సంజయ్ స్వరూప్, కమల్ కామరాజు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. వివాదాస్ప‌ద చిత్రంగా వార్త‌ల‌లోకి వ‌చ్చిన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ సినిమా చూసిన రామ్ గోపాల్ వ‌ర్మ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, డైరెక్ట‌ర్ సందీప్ ని తెగ మోసేశాడు.

అన్ని ప్రేమ కథల్లో లాగే అర్జున్ రెడ్డి చిత్ర‌ ప్రేమ కథలో కూడా హీరోయిన్ తండ్రి వాళ్ల ప్రేమకు నో చెప్తాడు. అంతేకాదు.. ఆమెకు నచ్చని వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి కూడా చేసేస్తాడు. ఈ క్ర‌మంలో కోరుకున్న ప్రియురాలు దూరం కావ‌డంతో డిప్రెష‌న్‌లోకి వెళ్ళిన అర్జున్ రెడ్డి త‌న డాక్ట‌ర్ వృత్తిని వ‌దిలేసుకుంటాడు. ఈ క్ర‌మంలో మ‌రి అత‌ని ప్రేమ క‌థ ఎలా న‌డిచింద‌నదే సినిమా క‌థ‌. ఇందులో విజ‌య్ న‌ట‌న‌, ఎమోష‌న‌ల్ సీన్స్, డైరెక్ట‌ర్ టేకింగ్ ఆడియ‌న్స్ ని క‌ట్టిప‌డేస్తున్నాయి.  ఈ చిత్రంపై అభిమానులే కాదు సినీ సెల‌బ్రిటీలు కూడా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. పలువురు  ప్ర‌ముఖులు ఈ సినిమాని ఆకాశానికి ఎత్తుతున్నారు. ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రానికి ర‌ధ‌న్ సంగీతం అందించాడు.

అసలు విజయ్ దేవరకొండ కోసమే కాదట!
వరుస విజయాల్లో ఉన్న హీరో ఓ డిఫరెంట్ సబ్జెక్ట్‌కు నో చెప్పాడట. అదికాస్తా మరో యంగ్ హీరో చేతికి చిక్కింది. ఓ హీరో కాదనుకున్న సబ్జెక్ట్‌ను ఏరికోరి ఎంచుకున్న ఆ మరో హీరోకు ఇప్పుడది సెన్సేషన్ హిట్‌ను హిట్ ను ఇవ్వడమే హాట్ టాపిక్
విజయ్ దేవరకొండ అనగానే ‘పెళ్లిచూపులు’ సినిమా వెంటనే గుర్తొస్తుంది. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సహా అప్పటికే మరో రెండు చిత్రాల్లో నటించినప్పటికీ గుర్తింపును అందించింది మాత్రం ‘పెళ్లిచూపులు’ సినిమానే. ఈ సినిమా తర్వాత ‘ద్వారక’ అనే మరో చిత్రంలో నటించినప్పటికీ నిరాశనే మిగిల్చింది. ఇక ‘అర్జున్ రెడ్డి’ అనే సినిమాతో జనం ముందుకొచ్చాడు ఈ యంగ్ హీరో.
సందీప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకొచ్చింది.    ఫస్ట్ లుక్ మొదలు ట్రైలర్ వరకూ ఇప్పటివరకూ వచ్చిన ప్రచారాస్త్రాలన్నీ సినిమాపై బోలెడు క్యూరియాసిటీ పెంచేశాయి. అసలు అంచనాలకు అంతుచిక్కనంత క్వశ్చన్ మార్క్‌గా ఉంది ‘అర్జున్ రెడ్డి’ క్యారెక్టర్. ఇంత డిఫరెంట్‌గా ఈ క్యారెక్టర్ ను క్రియేట్ చేసింది. అసలు విజయ్ దేవరకొండ కోసమే కాదట.
 ఓ హీరో సినిమా మరో హీరో చేతికి చిక్కడం కామన్. ‘అర్జున్ రెడ్డి’ సినిమాను కూడా తొలుత శర్వానంద్ తో చేయాలనుకున్నాడట దర్శకుడు సందీప్ రెడ్డి. శర్వానంద్‌కు కథ కూడా వినిపించాడట కానీ కారణాంతరాల వల్ల ఈ సినిమాలో నటించలేదు. అది కాస్తా.. విజయ్‌కు చేరింది. సబ్జెక్ట్ డిఫరెంట్‌గా ఉండి తెగ నచ్చేయడంతో ఈ సినిమాలో నటించాడు విజయ్ దేవరకొండ.