శివాజీ రాజా కుమారుడు విజయ్ రాజు కొత్త చిత్రం!

శివాజీ రాజా కుమారుడు విజయ్ రాజు, తమన్నా వ్యాస్ జంటగా చిత్రం. రామ్స్ రాథోడ్ దర్శకత్వం లో తూము నరసింహ పటేల్ జయ దుర్గ దేవి మల్టీ మీడియా పతాకం పై నిర్మిస్తున్న చిత్రం ప్రారంభం అయింది. హైదరాబాద్, వైజాగ్, చెన్నై, మున్నార్, గోవాలో సినిమా చిత్రీకరిస్తారు. ఈ కార్యక్రమానికి హీరో నాగ శౌర్య !ముఖ్య అతిధిగా వచ్చి ముహూర్తం షాట్ కి క్లాప్ కొట్టారు.
 
దర్శకుడు రామ్స్ రాథోడ్ మాట్లాడుతూ.. “మా హీరో విజయ్ రాజా ఈ చిత్రానికి పర్ఫెక్ట్. మా హీరో మాస్ కి క్లాస్ కి రెండిటికి సూట్ అవుతారు. అయన ఎనర్జీ లెవెల్ చాలా బాగుంది. హీరోయిన్ తమన్నా వ్యాస్ ఒరిస్సా లో టాప్ హీరోయిన్, మంచి నటి. ఇది పూర్తి ఎంటర్టైనర్ చిత్రం ” అని చెప్పారు.
 
శివాజీ రాజా మాట్లాడుతూ.. “ఈ సినిమా ఈరోజు నుంచి షూటింగ్ మొదలు. కథ బాగుంది. ఇద్దరు హీరోయిన్స్.. నాగ శౌర్య గారికి కృతజ్ఞతలు. ఈ చిత్రం మంచి విజయం సాదించాలి” అని కోరుకున్నారు.
 
నిర్మాత తూము నరసింహ పటేల్ మాట్లాడుతూ.. ” మంచి కథ తో వస్తున్నాం, చాలా గ్రాండ్ గా ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నాం. శివాజీ రాజా గారి అబ్బాయి విజయ్ రాజా తో చేయటం చాలా సంతోషం గా ఉంది. మీ అందరి ఆశీర్వాదం కావాలి” అని అన్నారు. కథ, మాటలు : శ్రీనాథ్ రెడ్డి, కెమెరా : కె బుజ్జి, సంగీతం : గ్యాని సింగ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విక్రమ్ రమణ