కమల్ హాసన్ నిర్మాణంలో హీరోగా విక్రమ్

కమల్ హాసన్, విక్రమ్ అదొక విలక్షణమైన కలయిక. ‘లోక నాయకుడు’ కమల్ హాసన్, వైవిధ్యమైన పాత్రలో నటించి మెప్పించే విక్రమ్. ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని కమల్ తన అఫీషియల్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అయితే ఇక్కడ ఓ చిన్న ట్విస్ట్ ఉంది. విక్రమ్ హీరోగా రూపొందనున్న సినిమాకి కమల్ నిర్మాతగా మాత్రమే ఉంటాడట. కమల్ సొంత బేనర్ రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బేనర్ పై ఈ చిత్రం నిర్మించనున్నాడు. ఇక ఈ చిత్రంలో కథానాయికగా తన రెండో కూతురు అక్షర హాసన్ ని ఎంచుకున్నాడు కమల్. రాజేష్ సెల్వ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. కమల్ తో ఈయన ‘చీకటి రాజ్యం’ సినిమా తీసిన సంగతి తెలిసిందే. ‘చీకటి రాజ్యం’ తరహాలోనే విక్రమ్ సినిమా కూడా థ్రిల్లర్ మూవీగా ఉంటుందని సమాచారం. ఫ్రెంచ్ మూవీ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్టు టాక్ . గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ధృవ నక్షత్రం’ అనే సినిమాలో విక్రమ్ నటిస్తుండగా, ఇది పూర్తి కాగానే కమల్ ప్రాజెక్టులోకి వస్తాడు విక్రమ్. మరోవైపు కమల్ హాసన్ ఒకవైపు రాజకీయాలు… మరోవైపు ‘విశ్వరూపం 2’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈవేసవిలో ‘విశ్వరూపం 2’ థియేటర్ లోకి తెచ్చే యత్నం చేస్తున్నాడు.