శ్రీ ధనలక్ష్మీ మూవీస్ పతాకంపై బీసు చందర్ గౌడ్ నిర్మిస్తున్న ప్రేమ కథాచిత్రం ‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట…’ 18న విడుదలకు సిద్దమవుతోంది.
ఎం.వినయ్ బాబు దర్శకత్వంలో రణధీర్, నందినీ హీరో హీరోయిన్లుగా నటించిన ‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట…’ చిత్ర నిర్మాత బీసు చందర్ గౌడ్ మాట్లాడుతూ… ‘విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే విభిన్నమైన ప్రేమకథాచిత్రమిది. ఇప్పటి వరకు గ్రామీణ నేపథ్యంలో ఎన్నో ప్రేమకథా చిత్రాలు వచ్చాయి. కానీ మా దర్శకుడు వినయ్‌బాబు అత్భుతమైన ట్విస్ట్‌లతో సినిమాను ఇంట్రెస్టింగ్‌గా తెరకెక్కించారు. అంతర్లీనంగా మంచి సందేశం కూడా ఉంటుంది. యువతతో పాటు ప్రతి తల్లీదండ్రి చూడాల్సిన చిత్రమిది’ అన్నారు.
దర్శకుడు ఎం. వినయ్ బాబు మాట్లాడుతూ… ‘ఈ చిత్రంలో మంచి కంటెంట్‌తో పాటు కమర్శియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. మా నిర్మాత ఎక్కడా రాజీపడకుండా సినిమాను క్వాలిటీగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు, పాటలకు ప్రేక్షకుల నుంచి అత్భుతమైన స్పందన వస్తోంది. మా చిత్రంలో రణధీర్, నందినీ హీరో హీరోయిన్లు. ముఖ్యపాత్రల్లో సుమన్, సూర్య, అమిత్ తివారీ, నిట్టల్, మిర్చి మాధవి, సంధ్య సన్ షైన్, సుష్మా గోపాల్, భాషా, చంద్రకాంత్, బీహెచ్‌ఈఎల్ ప్రసాద్, లేట్ శివ శంకర్ మాస్టర్, సురేష్.. తదితరులు నటించారు. మా చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’ అన్నారు. ఈ చిత్రానికి డిఓపి: విజయ్ కుమార్ ఎ, ఎడిటింగ్: నందమూరి హరి, ఎన్టీఆర్, సంగీతం: ఎస్.ఎస్.నివాస్.