తెలుగు హీరోయిన్ తో తెలుగు హీరోకు పెళ్లి ?

విశాల్ ఫ్యామిలీ తెలుగువారు అనే విషయం తెలిసిందే. దక్షిణాది సినిమా రంగం లో చాలా మంది మోస్ట్ ఎల్జిబుల్ బ్యాచిలర్ హీరోలు ఉన్నా… ఈ జాబితాలో అందరికంటే ముందు ఉన్న హీరో విశాల్. తమిళ్ తో పాటు తెలుగులోనూ విశాల్ కు మంచి ఫ్యాన్ ఫాలోవింగ్ ఉంది. ఆయన నటించిన ‘పందెం కోడి’, ‘అభిమన్యుడు’ తదితర చిత్రాలు తెలుగులోనూ మంచి విజయాలు సాధించాయి. అతడికి ఇప్పటికే నలభై ఏళ్లు వచ్చేశాయి. దీంతో విశాల్ తొందరగా పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ లో విశాల్ పెళ్లిపై జోరుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. గతంలో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీతో విశాల్ ప్రేమాయణం  తెలిసిందే. అయితే, శరత్ కుమార్ తో విభేదాల కారణంగా వీరిద్దరూ దూరమయ్యారు.
 
విశాల్ ఇప్పుడు ఓ తెలుగు హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నాడనే వార్త సామాజి మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమె విశాల్ తో కలిసి నటించింది కూడా. తెలుగులోనూ రెండు మూడు మంచి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఎవరో కాదు… ‘మనసారా’ మూవీతో తెలుగు తెరకు పరిచయమై ‘బస్ స్టాప్’,’మల్లెల తీరం లో సిరిమల్లెపూవు’ వంటి చిత్రాలు చేసింది శ్రీ దివ్య. బాలనటిగా కూడా పలు తెలుగు చిత్రాల్లో నటించిందామె. తమిళ్ లోనూ ‘పెన్సిల్’, ‘కాష్మోరా’ వంటి కొన్ని మూవీస్ లో హీరోయిన్ గా చేసింది. విశాల్ తో కలిసి ‘రాయుడు’ లో దివ్య కధా నాయికగా నటించింది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నరని కోలీవుడ్ లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. కానీ, దీనిపై అటు విశాల్ ఫ్యామిలీ నుంచి గానీ, ఇటు దివ్య కుటుంబం నుంచి గానీ  అధికారిక సమాచారం కోసం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.