ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విశాల్‌, ఆర్యల `ఎనిమీ`

బాలా`వాడు-వీడు`సినిమాలో తమిళ స్టార్ హీరోలు విశాల్, ఆర్య కలిసి నటించిన సినిమా అప్పట్లో ఓ హాట్ టాపిక్. వీరిద్ద‌రు పక్కా పల్లెటూరి మొరటోళ్లుగా నటించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. మరోసారి విశాల్, ఆర్య కలిసి మ‌రో భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ ఇటీవల హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్ర‌స్తుతం రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ చిత్రానికి `ఎనిమీ` అనే పేరు ప్రకటించారు . ఇది విశాల్ కు 30వ చిత్రం.. ఆర్య‌కు 32వ సినిమా. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ ప‌తాకంపై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు .ఈ చిత్రంలో విల‌క్షణ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ‘గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్’ లో హీరోయిన్‌గా న‌టించిన మృణాళిని ర‌వి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రానికి ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ ఆర్ ‌డి రాజ‌శేఖ‌ర్ ఛాయాగ్ర‌హ‌ణం.. మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు.