ముమ్మారు కాదన్నా మళ్ళీ అడిగాడు !

విల్‌ స్మిత్‌… హాలీవుడ్‌ నటుడిగా, నిర్మాతగా, కమెడియన్‌గా, గేయ రచయితగా స్మిత్‌ హాలీవుడ్‌లో అగ్రస్థానం లో ఉన్నారు. ఈ నటుడికి ‘ప్రపంచ సుందరి’ ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌తో సినిమా చేయాలని ఉందట. ‘హిందూస్తాన్‌ టైమ్స్‌’ లీడర్‌షిప్‌ సమిట్‌లో నటుడు-మ్యూజిషియన్‌ ఫర్హాన్‌ అక్తర్‌తో మాట్లాడుతూ.. తన ఇష్టాన్ని విల్‌ స్మిత్‌ బయటికి చెప్పారు…
 
దాదాపు 15 ఏళ్ల క్రిందట విల్‌ స్మిత్‌, ఐశ్వర్యను కలిశారట. ఆ సమయంలోనే ఇద్దరం కలిసి ఏదైనా చేద్దామని అనుకున్నామని, కానీ అది ఇప్పటి వరకు జరగలేదని, బహుశా ఆమెతో కలిసి తాను సినిమా చేస్తానేమో? అని తన మనసులోన మాటను బయటపెట్టారు. ఆవిధంగా  ఐశ్వర్య రాయ్‌తో సినిమా చేయాలని ఉందని తెలియజేశారు. నిజానికి విల్‌ స్మిత్‌ చేసిన ‘హిచ్’ లో చెయ్యమని ఐశ్వర్యను అడిగారట. ఆతర్వాత కూడా మరో రెండుసార్లు అతను ఐశ్వర్య తో చేసే అవకాశం పోయిందట.  
 
ఈ సమయంలోనే విల్‌ స్మిత్‌తో ఫర్హాన్‌ అక్తర్‌, భాంగ్రా స్టెపులను వేయించారు‌. విల్‌ స్మిత్‌తో సంభాషించడం చాలా సంతోషభరితంగా ఉందని, విత్‌ స్మిత్‌ వేసిన భాంగ్రా స్టెపుల వీడియోను ఫర్హాన్‌ అక్తర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.
 
‘మహమ్మద్‌ అలీ’ బయోపిక్‌లో విల్‌ స్మిత్‌, ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ” ఆన్‌స్క్రీన్‌లో బాక్సింగ్‌ ఛాంపియన్‌ క్యారెక్టర్‌లో నటించడం, నా కెరీర్‌లోనే ఎంతో నిర్మాణాత్మక సమయం. ఇది నన్ను పూర్తిగా మార్చేస్తుంది”అని తెలిపారు. ‘ఐయామ్‌ లెజెండ్‌’, ‘ఐ రోబో’, ‘ఇండిపెండెన్స్‌ డే’,హిచ్, ‘మెన్‌ ఇన్‌ బ్లాక్‌’ వంటి సినిమాల్లో విల్‌ స్మిత్‌ అద్భుతంగా నటించి పలువురి ప్రశంసలు అందుకున్నారు.

this isn’t the first time…

Will Smith is in town and he is celebrating his stay in India by doing bhangra with Farhan Akhtar. The latter has posted a video of them on stage breaking into some Bhangra moves while seating. Farhan writes, “What an awesomely and effortlessly cool man .. won all hearts with his candour and wit .. and boy, can he bust some Bhangra moves . That’s not it. He also admitted he would love to do a film with Aishwarya Rai Bachchan.
Will Smith was a part of Hindustan Times’ Leadership Summit where he spoke to Farhan Akhtar about all things cinema. That’s when he spoke about his Bollywood ambitions. “One of the things on my bucket list is to be on a Bollywood dance sequence. I met Aishwarya 15 years ago, we had conversations about doing something together but never happened. Perhaps I would do a film with her, “the actor said. Smith even complimented Farhan on how he was looking like Clark Kent, Superman’s alter-ego. Of course, the Indian actor looked surprised and blush.
Now, this isn’t the first time Will Smith has shown interest in working with Aishwarya Rai Bachchan. He wanted to cast her in Hitch but the actress had time constraints. She then went on to reject two more Will Smith films and reasoned that by saying, “I had to say no to Will for The Seven Pounds and now again for Tonight He Comes (later named as Hancock) I feel awful about it. But I have my priorities. Family comes first.” It seems since then Will has been harbouring this desire of working with Aishwarya. We wonder what the actress has to say about it.