“గంగ్న‌మ్ స్టైల్” రికార్డు పాల్ వాకర్ చెరిపేశాడు !

“ఓపెన్ గంగ్న‌మ్ స్టైల్” అంటూ సౌత్ కొరియా కు చెందిన సింగ‌ర్ సై పాడుతూ డ్యాన్స్ చేసిన వీడియో అది. యూట్యూబ్ లో ఆ వీడియో ఓ సంచ‌ల‌నం. జులై 15, 2012 న యూట్యూబ్ లో రిలీజ‌యిన “గంగ్న‌మ్ స్టైల్” సాంగ్ గ‌త ఐదు సంవ‌త్స‌రాలుగా యూట్యూబ్ లో టాప్ పొజిష‌న్ లో నిలుచున్న‌ది. అయితే… గ‌త ఐదు సంవ‌త్స‌రాల సై రికార్డును సింపుల్ గా బ‌ద్ద‌లు కొట్టేసింది మ‌రో వీడియో. ప్ర‌స్తుతానికి గంగ్న‌మ్ స్టైల్ వీడియో కు ఉన్న వ్యూస్ మొత్తం 2,896,363,483(289 కోట్ల 63 ల‌క్ష‌ల 63 వేల 483 వ్యూస్).

ఇక‌.. యూట్యూబ్ లో టాప్ పొజిష‌న్ ను ద‌క్కించుకున్న వీడియో పేరు “Wiz Khalifa – See You Again”, “ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్ 7” మూవీ కోసం ఈ సాంగ్ ను పాడారు. “ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్” యాక్ట‌ర్ పాల్ వాక‌ర్ కార్ యాక్సిడెంట్ లో చ‌నిపోయిన విష‌యం తెలిసిందే. అయితే ఫ్యూరియ‌స్ 7 మూవీ షూటింగ్ పూర్త‌వ‌కముందే ఆయ‌న మ‌ర‌ణించ‌డంతో ఆయ‌న జ్ఞాప‌కార్థం ఈ వీడియో ను రూపొందించింది మూవీ యూనిట్. ఏప్రిల్ 6, 2015 న రిలీజ‌యిన ఈ వీడియో తొంద‌ర‌లోనే సై గంగ్న‌మ్ ను బీట్ చేసి ఫస్ట్ పొజిష‌న్ లో నిల‌బ‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వీడియోకు 2,903,310,644 (290 కోట్ల 33 ల‌క్ష‌ల 10 వేల 644) వ్యూస్ వ‌చ్చాయి