నా జర్నీ ఇప్పుడే ప్రారంభమైంది !

‘ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్‌, గాడ్‌ఫాదర్‌ లేకుండా బాలీవుడ్‌లో రాణిస్తున్నందుకు చాలా హ్యాపీగా, గర్వంగా ఉంది’ అని చెబుతోంది యామీ గౌతమ్‌. ఇండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అందించే ఉమెన్‌ ఎచీవ్‌మెంట్‌ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా యామీ మాట్లాడుతూ….

‘ఈ అవార్డు నాకు ఎంతో ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్నిచ్చింది. చాలా గర్వంగా ఉంది. నేను ముంబయి నుంచి రాలేదు, నాకు బాలీవుడ్‌లో గాడ్‌ఫాదర్‌ లాంటి వారు ఎవ్వరూ లేరు. అయినా ఈ అవార్డు రావడం, ఈ స్థాయిలో నేనుండటం చాలా సంతోషంగా ఉంది. నా జర్నీ ఇప్పుడే ప్రారంభమైంది. నేను నేర్చుకోవాల్సింది, చూడాల్సింది, సాధించాల్సింది చాలా ఉంది. మరింత కష్టపడి పనిచేయడానికి ఈ అవార్డు నాకు స్ఫూర్తినిస్తుంది. కెరీర్‌ పరంగా నేనీ స్థాయిలో ఉండడానికి మా అమ్మే కారణం. నా జీవితంలో మా అమ్మ వండర్‌ఫుల్‌ ఉమెన్‌. నాపై నమ్మకంతో నన్నెంతగానో ప్రోత్సహించింది. ఆమెకు ఎన్ని థ్యాంక్స్‌ చెప్పినా తక్కువే’ అని తెలిపింది.