యష్ ‘కెజిఎఫ్ 2’‌ సంక్రాంతి కానుకగా జనవరి 14న

‘రాక్‌ స్టార్’‌ యష్ నటించిన ‘కెజిఎఫ్’‌ చాప్టర్‌-1తో రాఖీభాయ్ హవా బాక్సాఫీస్‌ సంచలనాన్ని సృష్టించింది. కన్నడ హీరో యష్ఒక్కసారిగా పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. అసాధారణ వసూళ్లను తెచ్చింది. దాదాపు రూ. 250 కోట్లకు పైగా కొల్లగొట్టి భారతీయ సినీ దృష్టిని ఆకర్షించింది. అందుకే ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌ వస్తోంది ? అనగానే అందరిలోనూ ఒకటే ఆసక్తి .నిజానికి ‘కేజీఎఫ్’‌ చాప్టర్‌ 2 అక్టోబర్‌ 13 2020లోనే థియేటర్లకు రావాల్సి ఉండేది.కానీ కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. రకరకాల కోర్టు కేసుల గొడవల వల్ల కూడా షూటింగ్‌ వాయిదా పర్వంలో సాగింది. 75శాతం పూర్తైన షూటింగ్‌ మార్చిలో ఆగిపోయింది.

సరిగ్గా ఏడు నెలల తర్వాత ఈ సినిమా చివరి దశ షూటింగ్‌ ప్రారంభమైంది. హీరో యష్‌ కూడా షూటింగ్‌లో పాల్గొనడానికి గురువారం లొకేషన్‌లో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా యష్‌కు సంబంధించిన లుక్‌ను చిత్రబృందం ట్విటర్‌లో షేర్‌ చేశారు. గుబురు గడ్డంతో సముద్రం వైపు నిలబడి తీక్షణంగా చూస్తున్నట్టుగా యష్‌ కనిపిస్తాడు. ‘అలల్ని ఆపలేం. కానీ వాటి మీద ఎదురీదడం నేర్చుకోవచ్చు. చిన్న విరామం తర్వాత రాకీ భాయ్‌ ప్రయాణం మళ్లీ మొదలుపెట్టాడు’ అని ట్వీట్‌ చేశారు యష్‌. “రాఖీ బాయ్‌.. ఈజ్‌ బ్యాక్‌” అంటూ కాప్షన్‌ జత చేశారు. ఇక అధీర పాత్రలో సంజయ్‌ దత్‌ నటిస్తుండగా.. యశ్‌ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో రవీనా టండన్‌ సినిమాకు కీలకమైన రమ్మికా సేన్‌ పాత్రలో నటిస్తోంది. రవీ బస్రూర్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమాను హొంబలే ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తోంది. కాగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14 ,2021లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

‘వకీల్‌సాబ్’‌.. ‘కెజిఎఫ్‌-2’ ఒకే రోజు ?… పవన్‌ కళ్యాణ్‌ మూడేళ్ల తర్వాత నటించిన చిత్రం ‘వకీల్‌సాబ్’‌. కోవిడ్‌ కారణంగా షూటింగ్‌ ఆగిపోయిన ఈ మూవీ చివరి షెడ్యూల్‌ షూటింగ్‌ దసరా తర్వాత ప్రారంభం కానుంది. అప్పటి నుంచి పవన్‌ కల్యాన్‌ షూటింగ్‌లో పాల్గననున్నాడు. అప్పటి నుండి డిసెంబర్‌లోపు షూటింగ్‌ పూర్తి చేసి సంక్రాంతికి జనవరి 14న సినిమా విడుదల చేయాలని నిర్మాత దిల్‌రాజ్‌ భావిస్తున్నాడు. ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాడు. అయితే అదే రోజున ‘కెజిఎఫ్‌-2’ సినిమాను కూడా రిలీజ్‌ చేయబోతున్నారు. రెండు పెద్ద సినిమాలు ఒకేరోజు పోటీ పడితే డిస్ట్రిబ్యూటర్స్‌ నష్టాలు పాలయ్యే అవకాశముంది. దీంతో రెండు సినిమాలను నాలుగు రోజుల తేడాతో రిలీజ్‌ చేయాలని దిల్‌ రాజు భావిస్తున్నారు. ఇందు కోసం కెజిఎఫ్‌ నిర్మాతలతోనూ మాట్లాడబోతున్నారు.