ఎర్నేని నవీన్‌ ఆవిష్కరించిన ‘రాంగ్ నెంబర్’‌ ఫస్ట్‌లుక్‌

ఆర్వీ సాంబశివరావు దర్శకత్వంలో ఆర్వీఎస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఆర్వీఎస్‌, ఫర్హానా నస్రీన్‌ నిర్మాతలుగా రూపొందిస్తున్న చిత్రం ‘రాంగ్ నెంబర్‌’. ఈ చిత్రానికి ఆర్వీ సాంబశివరావు దర్శకత్వం వహించారు. నూతన నటీనటులు మారుతీరామ్‌, జియోడార్ల జంటగా సీనియర్ నటుడు అజయ్‌ ఘోష్‌ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్, ట్రైలర్‌ ‌ను హైదరాబాద్‌లో మైత్రీ మూవీస్‌ అధినేత ఎర్నేని నవీన్‌ ఆవిష్కరించారు.
ఎర్నేని నవీన్‌ మాట్లాడుతూ.. “ లవ్‌, క్రైమ్‌,యాక్షన్‌, ఫ్యామిలీ, సెంటిమెంట్ అంశాలుగా తీసుకుని రూపొందించిన సినిమా ఈ రాంగ్ నెంబర్‌.ట్రైలర్‌, ఫస్ట్‌లుక్ చాలా బావుంద”ని కితాబిచ్చారు.
చిత్ర దర్శకుడు ఆర్వీ సాంబశివరావు మాట్లాడుతూ.. “ ఈ చిత్రం ద్వారా ప్రముఖ నటుడు స్వర్గీయ రాజనాల గారి మనవడు రాజనాల సతీష్‌ని విలన్‌గా పరిచయం చేస్తున్నాం. సహకరించిన నిర్మాతలు ఆర్వీఎస్‌, ఫర్హానా నస్రీన్‌ లకు ప్రత్యేక కృతజ్ఞతలు”
మారుతిరామ్‌, జియో డార్ల, అజయ్‌ ఘోష్‌, షేకింగ్ శేషు, సుమన్‌ శెట్టి, రాజనాల సతీష్‌ నాయుడు, రోషిక, హాసిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా ఆనంద్‌ మరుకుర్తి, సంగీతం ఈశ్వర్‌ హేమకాంత్‌, కథ స్క్రీన్‌ప్లే పాటలు మాటలు దర్శకత్వం ఆర్వీ సాంబశివరావు, నిర్మాతలు ఆర్వీఎస్‌, ఫర్హానా నస్రీన్‌