బాబి చేతుల మీదుగా ‘ఎర్ర‌చీర’ సాంగ్ విడుద‌ల‌

‘ఎర్రచీర’ సి.హెచ్ సుమ‌న్ బాబు స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్నారు. శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బేబి ఢ‌మరి సమర్పణలో ‘ఎర్రచీర’. మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ హర్రర్ చిత్రంలో శ్రీకాంత్, సాయి తేజ‌స్విని సి.హెచ్ సుమన్‌బాబు, కారుణ్య, సంజ‌నా శెట్టి, కమల్‌ కామరాజు, భానుశ్రీ, అజయ్‌, ఉత్తేజ్‌, మహేష్‌లు నటీనటులు. ఈ సినిమాలోని ‘రాజ‌మండ్రి రైలెక్కి చెక్కేస్తా’ లిరిక‌ల్ వీడియో సాంగ్ ను ‘ఢ‌మ‌రి మ్యూజిక్’ కంపెనీ ద్వారా రిలీజ్ చేసారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన స్టార్ డైరెక్ట‌ర్ బాబీ, సీనియ‌ర్ న‌టుడు స‌త్య‌ప్ర‌కాశ్ పాట‌ను, ఢ‌మ‌రి మ్యూజిక్ కంపెనీ లోగోను ఆవిష్క‌రించారు. అలాగే సినిమా రిలీజ్ డేట్ పోస్ట‌ర్ ను నిర్మాత తుమ్మ‌ల‌ప‌ల్లి రామ స‌త్యనారాయ‌ణ‌, బిగ్ సిడీని అంతా క‌లిసి ఆవిష్క‌రించారు.
బాబి మాట్లాడుతూ… ` ఐట‌మ్ సాంగ్ బాగుంది. సుమ‌న్ గారు ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా రెండు బాద్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించ‌డం గొప్ప విష‌యం ` అని అన్నారు.
 
తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ…`ఈ సినిమాకి టైటిలే హీరో. సుమ‌న్ గారు ఓ ముఖ్య‌మైన పాత్ర మాత్ర‌మే చేసారు. సుమ‌న్ భ‌విష్య‌త్ లో మ‌రిన్ని మంచి సినిమాలు చేయాలి `అని అన్నారు.
 
ద‌ర్శ‌క‌, నిర్మాత స‌త్య సుమ‌న్ బాబు మాట్లాడుతూ…` బాబిగారి చేతుల మీదుగా ఈ పాట రిలీజ్ అవ్వ‌డం సంతోషంగా ఉంది. ఢ‌మ‌రి మ్యూజిక్ కంపెనీ నాదే. మా కంపెనీ స‌క్సెస్ అవుతుంద‌న్న న‌మ్మ‌క ఉంది. ఇప్ప‌టివ‌ర‌కూ చూడని విధంగా ఇందులో శ్రీకాంత్ గారు అఘోర పాత్ర‌లో క‌నిపిస్తారు. డిసెంబ‌ర్ 27న సినిమా రిలీజ్ చేస్తాం` అని అన్నారు.
 
నిర్మాత‌, న‌టుడు గురురాజ్ మాట్లాడుతూ…’ఎర్ర‌చీర’ లో అన్ని ర‌కాల ఎమోష‌న్స్ క‌నిపిస్తాయి. ‘రైలెక్కి రాజ‌మండ్రి చెక్కెస్తా’ సాంగ్ హైలైట్ గా ఉంటుంది. ర‌ఘుబాబు పాత్ర అంద‌ర్నీ బాగా న‌వ్విస్తుంది. మిగ‌తా పాత్ర‌లు ఆస‌క్తిక‌రంగా ఉంటాయి ` అని అన్నారు.
 
మాజీ మంత్రి పుష్ప‌లీల మాట్లాడుతూ… ` ఇటీవ‌ల ప‌రిశ్ర‌మ‌లో కొత్త వాళ్లు బాగా స‌క్సెస్ అవుతున్నారు. సీనియ‌ర్ల‌కు మంచి పోటీ ఇస్తున్నారు. ఔత్సాహికులంతా త‌మ ప్ర‌తిభ‌ను నిరూపించుకోవాలి. ప‌రిశ్ర‌మ పెద్ద‌లు అవ‌కాశాలు క‌ల్పించాలి. మంచి క‌థ‌తో ‘ఎర్ర చీర’ తెర‌కెక్కిస్తున్నారు. సినిమా విజ‌యం సాధించి మంచి పేరు తీసుకురావాలి` అని అన్నారు.