‘యంగ్ రెబల్ స్టార్’ ప్రభాస్ ‘ఇండియా నెంబర్ వన్ హీరో’ అనిపించుకుంటున్నాడు.’బాహుబలి’ తర్వాత భారీ అంచనాలతో విడుదలైన ‘సాహో’ కూడా హిందీలో కమర్షియల్ గా అద్భుతమైన విజయం సాధించింది. సుజిత్ తెరకెక్కించిన ఈ చిత్రం బాలీవుడ్ లో 250 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అక్కడ స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా ప్రభాస్ కూడా వసూళ్లు రాబట్టాడు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఆ సినిమాతో వచ్చిన ఇమేజ్ ని, బిజినెస్ క్రేజ్ ని నిలుపుకునే పనిలో పడ్డాడు ప్రభాస్. చాలా జాగ్రత్తగా యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథల వైపు అడుగులు వేస్తున్నాడు. ప్రభాస్ నటించిన సినిమాలు వందల కోట్ల బిజినెస్ చేస్తున్నాయి. ప్రభాస్ హీరోగా నటించే సినిమాల కోసం వందల కోట్ల బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. దీన్నిబట్టి అతని రేంజ్ ఏంటి అనేది అర్థం అవుతుంది.
ఇండియాలో ఇప్పటి వరకు సినిమాకు 100 కోట్ల పారితోషికం ఎవరూ అందుకోలేదు. సినిమాకు వంద కోట్ల పారితోషికం అంటే చిన్న విషయం కాదు. ఆ రికార్డు చేరుకున్న తొలి హీరోగా ప్రభాస్ చరిత్ర సృష్టించాడు. ఒక్కో సినిమాకు 100 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం ‘రాధే శ్యామ్’, ‘సలార్’, నాగ్ అశ్విన్ సినిమా, ‘ఆదిపురుష్’ సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో ‘రాధే శ్యామ్’ జులై 30న విడుదల కానుంది. ‘సలార్’ 2022 సంక్రాంతికి విడుదల కానుంది. అలాగే ‘ఆదిపురుష్ 2022 ఆగస్టులో విడుదలకు సిద్ధం అవుతుంది. 2023లో నాగ్ అశ్విన్ సినిమా రిలీజ్ కానుంది.
రవితేజ రెమ్యునరేషన్ ‘టాక్ ఆఫ్ ది టౌన్’… రవితేజ ‘క్రాక్’ పెద్ద హిట్ అయ్యింది. ఈ చిత్రంతో చాలా రోజుల తర్వాత రవితేజ మళ్లీ ఫాంలోకి వచ్చాడు. రవితేజ ‘బ్యాక్ టు బ్యాక్’ సినిమాలతో అభిమానులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ‘ఖిలాడీ’ సినిమా సెట్స్‌పై ఉండగానే త్రినాథరావు నక్కినతో కలిసి 68వ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు. ఇక ఈ చిత్రానికి రవితేజ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇపుడు ‘టాక్ ఆఫ్ ది టౌన్’గా మారింది. తాజా టాక్ ప్రకారం రవితేజ ఈ మూవీకి రూ.16 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడట.’క్రాక్’ చిత్రానికి రెమ్యునరేషన్ తోపాటు వైజాగ్ ప్రాంతాల్లో వచ్చిన లాభాల్లో షేర్ కూడా తీసుకున్నాడు. ఈ సారి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రవితేజ డిమాండ్‌కు అనుగుణంగా ఇంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చేందుకు రెడీ అయినట్టు టాక్. మారుతి-యూవీ క్రియేషన్స్ కాంబోలో వస్తున్న పక్కా కమర్షియల్ చిత్రానికి మొదట రవితేజను అనుకోగా..రెమ్యునరేషన్ విషయంలో తగ్గించుకునేది లేదని రవితేజ చెప్పేసాడట. దీంతో మారుతి గోపీచంద్ హీరోగా ఆ సినిమా చేస్తున్నాడట.