వినోదంతో చక్కటి జాలీ ట్రిప్‌లా ఎంఎస్ రాజు ‘7 డేస్ 6 నైట్స్’

సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో.. వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై ఎంఎస్ రాజు దర్శకుడిగా రూపొందుతున్న సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్.ఎస్ నిర్మాతలు.  దర్శకునిగా ‘డర్టీ హరి’తో గతేడాది ఎంఎస్ రాజు హిట్ అందుకున్నారు.
‘7 డేస్ 6 నైట్స్’ లో సుమంత్ అశ్విన్ హీరో . హీరోయిన్ మెహర్ చావల్ (తొలి పరిచయం). మరో జంటగా రోహన్, క్రితికా శెట్టిని పరిచయం చేస్తున్నారు. మరో ఇద్దరు అందమైన అమ్మాయిలు సుష్మ, రిషికా బాలి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ఫేమ్ గోపరాజు రమణ అతిథి పాత్రలో కనిపించనున్నారు.
దర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ… “‘డర్టీ హరి’ కి భిన్నంగా ఉండే చిత్రమిది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంటిల్లిపాదినీ వినోదపరిచే విధంగా చక్కటి జాలీ ట్రిప్‌లా ఉంటుంది. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, విజువల్స్, మ్యూజిక్ ఈ చిత్రాన్ని డామినేట్ చేస్తాయి. సినిమాలో పాత్రలు మన కళ్ల ముందు కదలాడే సజీవ పాత్రల్లా ఉంటాయి. మంచి కథ, దానికి తగ్గ ఆర్టిస్టులను ఎంపిక చేసుకుని దర్శకునిగా సినిమా చేయడాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. తొలి షెడ్యూల్ 22 రోజులు చిత్రీకరణ చేశాం. జూలై 28 నుంచి 20 రోజుల పాటు కంటిన్యూస్‌గా బెంగళూరు, ఉడిపి, గోకర్ణ, గోవాలలో షూటింగ్ చేస్తాం” అని అన్నారు.  ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్ గొల్లపూడి, ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి, కూర్పు: జునైద్ సిద్ధిఖీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత, కో-డైరెక్టర్: యువి సుష్మ, కో ప్రొడ్యూసర్స్: జె. శ్రీనివాసరాజు, మంతెన రాము