కె.బి.కె.మోహనరాజుకు ‘ఘంటసాల సంగీత పురస్కారం’

నేటి యుగం పాటల్లో శబ్దమేగానీ సాహిత్యం వినిపించడం లేదని, అదే ఘంటసాల పాటల్లో ప్రాణముంటుందని తమిళనాడు పూర్వ గవర్నర్‌ డా.కె.రోశయ్య అన్నారు. ‘యువకళావాహిని’ 42 వసంతాల పండగలో భాగంగా ‘పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం’లోని ఎన్టీఆర్‌ కళామందిరంలో మూడు రోజుల పాటు నిర్వహించే అమర గాయనీగాయకుల ఆరాధనోత్సవం బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రోశయ్య మాట్లాడుతూ.. అలనాటి పాటల్లో సాహిత్య విలువలున్నాయన్నారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత సినీ గాయకులు కె.బి.కె.మోహనరాజును ‘ఘంటసాల సంగీత పురస్కారం’తో ఘనంగా సత్కరించారు. ప్రముఖ నటి గీతాంజలి, సంఘ సేవకులు బండారు సుబ్బారావు, జి.హనుమంతరావు తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు. ‘యువకళావాహిని’ అధ్యక్షులు వై.కె.నాగేశ్వరరావు స్వాగతం పలికారు. అంతకు ముందు ప్రముఖ గాయనీ గాయకులు డి.ఎ.మిత్ర, విజయలక్ష్మి, సురేఖామూర్తి, శశికళాస్వామి ‘ఘంటసాల చలనచిత్ర సంగీత విభావరి’లో ఆపాత మధుర గీతాలతో మైమరపించారు. డా.వి.వి.రామారావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

YUVAKALAVAHINI conducted AMARA GAYANIGAYAKULA ARADHANOTSAVAM…

On 27th Dec held at NTR Kala mandiram, Potti Sreeramulu Telugu University On the occasion of YuvakaLavahini 42 Vasanthala Pandaga.Celebrations inaugurated by Dr.KONIJETI ROSAIAH . This connection,Sri K.B.K.Mohana Raju,Famous Singer, honoured with GHANTASALASALA MUSIC AWARD,in which Dr.K.Rosaiah,Sri B.Subba Rao,Movie Artiste Geethanjali,Ln G.H.Rao,participated. Dr. V V Rama Rao compered the entire function.
A Mega Musical Nite, GHANTASALA CHALANACHITRA SANGEETHA VIBHAVARI presented by Famous Singers D.A.Mitra, ‘Singing Star’ Vijayalakshmi,’Singing Queen’ Surekha Murthy, Sasikala Swamy&Anchor Dr.V.V.Rama Rao.
KANAKADURGA NRITYA VIBHAVARI,Nirmala Prabhakar also felicitated Sri KBK MOHAN RAJU & Greeted Yuvakalavahini Nageswara Rao. Mr K.V.Rao,co-sponsorer also honoured in the Function.