యువకళావాహిని ‘అమరావతి నాటకోత్సవాలు’ విజయవంతం

ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక బంధు శ్రీసారిపల్లికొండలరావు ఫౌండేషన్ సారధ్యంలో,యువకళావాహిని ఆధ్వర్యంలో మార్చి 27వ తేదీన గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర దేవాలయ ప్రాంగణంలో అన్నమయ్య కళా వేదికలో అమరావతి నాటకోత్సవం అత్యద్భు తంగాజరిగింది.
తొలుత కనకదుర్గ నృత్యవిభావరి వారు గురు నిర్మలా ప్రభాకర్ ఆధ్వర్యంలో భరతనాట్యం ప్రదర్శించారు.వెంటనేజరిగిన సభాకార్యక్రమంలో యువకళావాహిని రంగస్థలపురస్కారాల ప్రదానం చేశారు.ముఖ్య అతిథిగా శ్రీ మండలి బుద్ధప్రసాద్, విశిష్ట అతిథి గా శ్రీజి.వి.ఆంజనేయులు,సభాప్రారంభకులుగా శ్రీరాయపాటిశ్రీనివాస్,సభాధ్యక్షులుగా డా.మొదలినాగభూషణశర్మగారువిచ్చేసి పురస్కారాలు ప్రదానం చేశారు.
గురజాడ పురస్కారాన్ని శ్రీరావినూతలప్రేమకిషోర్,బళ్ళారి రాఘవ పురస్కారాన్ని శ్రీ గుమ్మడి నాగేశ్వరరావు,సి.యస్.ఆర్.పురస్కారాన్ని శ్రీలంక లక్ష్మీ నారాయణ, గరికపాటి రాజారావు పురస్కారాన్ని శ్రీ చెరుకూరి సాంబశివరావు,వనారసగోవిందరావు పురస్కారాన్ని శ్రీ అభినయ శ్రీనివాస్, రఘు రామయ్య పురస్కారాన్ని యం.రామలింగేశ్వరరావు స్వీకరించారు.సభానంతరం హర్షక్రియేషన్స్ వారు నాగూడు నాటికి ప్రదర్శించారు. దేవాలయం కమిటీ అధ్యక్షులు శ్రీ సి.హెచ్.మస్తానయ్య వందనసమర్పణతో కార్యక్రమాలు ముగిసాయి.

అమరావతి నాటకోత్సవం రెండవ రోజు కార్యక్రమం విజయవంతంగా యువకళావాహిని నిర్వహించింది.పద్మశ్రీపురస్కారస్వీకర్త డా.తుర్లపాటికుటుంబరావు,నాటకవిశ్లేషకులు శ్రీవేదయ్య, కళా రత్న నాయుడు గోపి,రచయిత,ప్రయోక్త శ్రీకావూరి సత్యనారాయణ,తెనాలిపట్టణకళాకారులసంఘంఅధ్యక్షులుశ్రీ జానీబాషా,శ్రీ సిహెచ్ ముస్తానయ్య పాల్గొని కళా నిలయం నిర్వాహకులు శ్రీ ప్రగడ రాజమోహన్ గారిని సత్కరించారు.

సభకు ముందుగా ప్రదర్శించిన గాలిగోపురం నిర్వాహకులు శ్రీ నరసింహన్ గారిని,సభానంతరం ప్రదర్శించిన బతుకు చిత్రం రచయిత,దర్శకులుశ్రీ చెరుకూరి సాంబశివరావు గారిని యీ సందర్భంగా సత్కరించారు.

 విజయవంతంగా యువకళావాహిని ఆధ్వర్యంలో అమరావతి నాటకోత్సవం మూడురోజుల కార్యక్రమం గుంటూరు అన్నమయ్య కళా వేదికలో ముగిసింది.తొలుత ప్రఖ్యాత గాయనీ గాయకులు శశికళ,పవన్ కుమార్, మురళీధర్ సినీగీతాలు సమర్పించారు.తదుపరి నవజ్యోతి,కావలి వారిచే ఆల్చిగాడు నాటిక ప్రదర్శితమయింది.అమరావతి నాటకోత్సవం ముగింపు సమావేశంలో శ్రీనూతలపాటి సాంబయ్య,సంధ్యఫిలింఅకాడెమీ రవికనగాల,శ్రీ చుండూరు నరసింహారావు, శ్రీ సిహెచ్.మస్తానయ్య పాల్గొని కళాకారులు శ్రీతుర్లపాటి రాధాకృష్ణమూర్తి;గాయనీగాయకులు శశికళ,సౌజన్య,పవన్, మురళీధర్ గార్లను సన్మానించారు.