ఆర్యని పెళ్లి చేసుకోడానికి డెబ్భై వేల ద‌ర‌ఖాస్తులు

వరుడు , సైజ్ జీరో, ఒక రాజు ఒక రాణి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్ష‌కుల‌ హృదయాల్లో హీరో ఆర్య‌ చోటు దక్కించుకున్నాడు. రీసెంట్‌గా క‌దంబ‌న్ సిన్మాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ హీరో త్వ‌ర‌లో సుందర్ డైరెక్ష‌న్‌లో ‘సంఘ‌మిత్ర’ అనే భారీ ప్రాజెక్ట్  ను పట్టాలెక్కించనున్నాడు. అయితే ఇటీవ‌ల తన ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేసిన ఆర్య…. “పెళ్లి విషయంలో నాకు ఎలాంటి డిమాండ్స్ కానీ, కండీషన్స్ కానీ లేవని నేను మీకు నచ్చితే.. ఆ అమ్మాయికి చక్కటి జోడీ అవుతానని అనిపిస్తే నా నంబర్ 73301-73301కి కాల్ చేయండని… ఇది ఫేక్ కాదు. నా లైఫ్” అని వీడియో ద్వారా తెలిపారు. వెంట‌నే తన అభిమానులంద‌రు ఆ నంబ‌ర్‌కి ఫోన్ కాల్స్ చేయడం మొదలు పెట్టారు.

అయితే ఆర్య తాను అమ్మాయి కావాల‌ని అంది …’రియ‌ల్ లైఫ్ మ్యారేజ్ కోసం కాదు. రీల్ లైఫ్ మ్యారేజ్‌కోసం’ అని అభిమానులకి షాక్ ఇచ్చాడు. వయాకామ్ 18 అనే సంస్థ ఇటీవల కలర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ చానల్‌ను స్టార్ట్ చేసింది. ఇందులో ‘ఇంగవీట్లు మాపిళ్ళై’ అనే ‘స్వయంవరం’ పోగ్రాంని ప్రసారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో నటుడు ఆర్య పెళ్లికొడుకుగా పాల్గొననుండ‌గా, ఆయ‌న‌తో జోడి క‌ట్టడానికి 70వేల మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నార‌ట‌. 6 వేల మంది ఆన్‌లైన్‌లో పేర్లు న‌మోదు చేసుకున్నార‌ట‌. మొత్తంగా ఇందులోంచి షార్ట్ లిస్ట్ చేసి ఫైన‌ల్‌గా 18 మందిని ఎంపిక చేశారు. ఏప్రిల్‌లో ప్ర‌సారం కానున్న ఈ షోలో 18 మంది అమ్మాయిల‌తో ఆర్య ‘స్వ‌యంవ‌రం’ జరగనుంది.