డైరెక్టర్ శ్రీనాథ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ – మందమర్రి టు చందమామ, ఆగేది కాదు ఇది ఫుల్ హంగామా. ఈ హంగామా మిమ్మల్ని 2 గంటల 15 నిమిషాలు ఆగకుండా నవ్విస్తుంది. గ్లింప్స్ చూసి మా యాక్టర్స్ అమాయకులు అంటున్నారు. కానీ వీళ్లు అమాయకులే కాదు ధైర్యవంతులు కూడా. ఎవరైనా వీళ్లకు పాకిస్తాన్ మనల్ని ఇబ్బందిపెడుతుంది అంటే దాని మీద బాంబులు వేసి వస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఆలోచించరు. అంత ధైర్యవంతులు. వీళ్లు ఏమీ తెలియకుండా రాకెట్ ఎలా చేశారు, స్పేస్ కు ఎలా వెళ్లారు. ఎక్కాలు రాకుండా రాకెట్ కు కావాల్సిన లెక్కలు ఎలా చేశారు అనేది మీరంతా సినిమాలో చూడబోతున్నారు. అన్నారు.
చిత్ర నిర్మాత ప్రవీణ్ మొలక మాట్లాడుతూ – డైరెక్టర్ శ్రీనాథ్ ఈ కథ చెబుతున్నప్పుడు రెండున్నర గంటలు ఒక ఫ్రెండ్ తో సరదాగా మాట్లాడుకుంటే ఎంత హ్యాపీగా ఫీలవుతామో అలా ఫీలయ్యాను. కుటుంబమంతా కలిసి ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఎలాంటి అసభ్యత ఉండదు. థియేటర్ లో ప్రతి ప్రేక్షకుడు నవ్వుకుంటాడని గ్యారెంటీగా చెప్పగలను. అన్నారు.
మూవీ ప్రెజెంటర్ వేణు ఊడుగుల మాట్లాడుతూ – ఈ సినిమా చూసిన తర్వాత ఈ చిత్రంలో నేను పార్ట్ కావాలని అనిపించింది. ఈ టీమ్ అంతా చాలా కాలంగా నాకు పరిచయం. ఈ టీమ్ నిజాయితీగా, ప్యాషన్ తో ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారని నమ్మాను. ఇది రెగ్యులర్ రొటీన్ సినిమా కాదు. ఒక అర్థవంతమైన సినిమా. అలాగే ఈ చిత్రాన్ని కమర్షియల్ ఇంపాక్ట్ ఉన్న ట్రీమ్ మెంట్ తో రూపొందించారు. వీళ్ల ప్రయత్నం అద్భుతంగా అనిపించింది. అమాయకులైన ఒక నలుగురు యువకులు రాకెట్ తయారు చేసుకుని స్పేస్ లోకి వెళ్లడం అనే పాయింట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సైన్స్ తెలియకుండా, పెద్దగా చదువుకోకుండా ఏదో సాధించాలనే తపనతో నలుగురు యువకులు రాకెట్ తయారుచేయడం, స్పేస్ లోకి వెళ్లడం వంటి అంశాలు ప్రేక్షకులకు కొత్త ఫీల్ కలిగిస్తాయి. స్పేస్ లోకి వెళ్లేందుకు రాకెట్ తయారుచేసి స్పేస్ లోకి లాంఛ్ చేసే క్రమంలో చాలా ఫన్ క్రియేట్ అవుతుంది. ఈ జర్నీలో వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులు, తెలుసుకున్న విషయాలను అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు. ఈ నెల 30న ఈ సినిమా థియేటర్స్ లోకి వస్తోంది. మీరంతా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
ప్రముఖ ఆస్ట్రలాజర్ వేణు స్వామి మాట్లాడుతూ – ఈ మధ్య చిన్న చిత్రాలు తెలుగులో మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఈ సినిమా కూడా అలాంటి హిట్ అవుతుంది. ఎందుకంటే గొప్ప నక్షత్రాల్లో పుట్టిన వారు ఈ సినిమా టీమ్ లో ఉన్నారు. మనం ప్రతి రోజూ చంద్రుడు, సూర్యుడిని చూస్తుంటాం. ఆయన ప్రొడ్యూసర్ గా మారితే చంద్రుడు, డైరెక్టర్ గా మారితే సూర్యుడు అనుకోవచ్చు. మా కాంబోలో త్వరలో ఒక పెద్ద సినిమా చేయబోతున్నాం. కృతిక నక్షత్రయుక్త పౌర్ణమి కార్తీకమాసం అక్టోబర్ 30న రిలీజ్ కాబోతోంది కాబట్టి ఈ సినిమా పెద్ద విజయం సాధించబోతోంది. అన్నారు.
నటీనటులు – శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ, తదితరులు















